కొందరు హీరోల్లా డబ్బాలు కొట్టవద్దు.. అర్థమైందా? విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన మోహన్‌బాబు
హీరో మోహన్ బాబు. కేవలం విలక్షణమైన నటుడే కాదు. నిజ జీవితంలోనూ చాలా సంస్కారం కలిగిన నేత. ఓ తండ్రిగా చాలా స్ట్రిక్ట్. ఆయన ఇద్దరు కుమారులు, కుమార్తెను కూడా అంతే స్ట్రిక్ట్‌గా పెంచారు. వారు ఏ చిన్న తప్పు చ
హీరో మోహన్ బాబు. కేవలం విలక్షణమైన నటుడే కాదు. నిజ జీవితంలోనూ చాలా సంస్కారం కలిగిన నేత. ఓ తండ్రిగా చాలా స్ట్రిక్ట్. ఆయన ఇద్దరు కుమారులు, కుమార్తెను కూడా అంతే స్ట్రిక్ట్‌గా పెంచారు. వారు ఏ చిన్న తప్పు చేసినా.. బాల్యంలోనే కాదు.. వారికి పెళ్లయి పిల్లలు ఉన్నా.. ఓ తండ్రి స్థానంలో ఉంటూ దండిస్తున్నారు.
తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. తన కుమారుడు హీరో అయిన మంచు విష్ణుకు వేదికపైనే నలుగురి సమక్షంలోనే గట్టిగా వార్నింగ్ ఇచ్చారు మంచు విష్ణు నటించిన తాజా చిత్రం "లక్కున్నోడు". ఈ చిత్రం ఫంక్షన్ సోమవారం రాత్రి జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్‌లో తన కొడుకు విష్ణుకు మోహన్‌బాబు వార్నింగ్ ఇచ్చాడు.
'ఏయ్... విష్ణు.. ఓ విషయంలో నీకు వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇట్స్ ఏ వార్నింగ్. భార్య, పిల్లలు ఉన్నవాడివి. ఈ మధ్యే టీవీల్లో చూశాను. పదిమంది ఎదుట నువ్వు చేసిన తప్పు చెబుతున్నాను. 'నేను సహజంగా నా సినిమా ఆడియో ఫంక్షన్లకు కూడా వెళ్లను' అని ఓ ఇంటర్వ్యూలో నీవు చెప్పావు. అది తప్పు. నీ సినిమా ఆడియో ఫంక్షన్‌కు నువ్వు వెళ్లాలి. ఇతర హీరోల సినిమాల ఆడియో ఫంక్షన్లకూ హాజరవ్వాలి. నిన్ను ప్రేమగా పిలిచినపుడు తప్పక వెళ్లాలి. నేను ఎక్కడికీ వెళ్లనని కొంతమంది హీరోల్లా డబ్బాలు కొట్టవద్దు. అర్థమైందా. డబ్బాలు వద్దు మనకు అంటూ సుతిమెత్తని వార్నింగ్ ఇచ్చారు.