Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాల‌య్య మైత్రీ సంస్థ‌కు ఓకే చెప్పేనా..?

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో న‌టిస్తున్నారు. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాతో వంద చిత్రాలు పూర్తి చేసుకున్న బాల‌య్య స్పీడు పెంచి వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ త‌ర్వాత వినాయ‌క్‌తో సినిమా చేయ‌నున్నాడు.

Advertiesment
బాల‌య్య మైత్రీ సంస్థ‌కు ఓకే చెప్పేనా..?
, సోమవారం, 2 జులై 2018 (18:10 IST)
నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో న‌టిస్తున్నారు. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాతో వంద చిత్రాలు పూర్తి చేసుకున్న బాల‌య్య స్పీడు పెంచి వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ త‌ర్వాత వినాయ‌క్‌తో సినిమా చేయ‌నున్నాడు. దీనికి క‌థ ఇంకా ఓకే కాలేదు. ఈ సినిమాతో పాటు బాల‌య్య బోయ‌పాటి శ్రీనుతో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో సింహ‌, లెజెండ్ సినిమాలు రూపొందాయి.
 
ఇప్పుడు హ్యాట్రిక్ ఫిల్మ్‌కి ప్లాన్ జ‌రుగుతుండ‌టంతో భారీ అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి. అయితే... బాల‌య్య‌, బోయ‌పాటి కాంబినేష‌న్లో మూవీని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. బోయ‌పాటి ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌తో ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి... త్వ‌ర‌లోనే బాల‌య్య - బోయ‌పాటి సినిమాని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మ‌రి.. మైత్రీ మూవీస్ సంస్థ‌కు బాల‌య్య ఓకే చెబుతారో? లేదో... చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా? తమ్మారెడ్డి ఏమంటున్నారు?