Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జనవరి 9న ముఖ్యమంత్రిగా బాలయ్య ప్రమాణ స్వీకారం...

నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా రూపొందుతోన్న ఎన్టీఆర్ బ‌యోపిక్ ఈరోజు సెట్స్ పైకి వెళ్లింది. జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాపై అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నా

Advertiesment
జనవరి 9న ముఖ్యమంత్రిగా బాలయ్య ప్రమాణ స్వీకారం...
, గురువారం, 5 జులై 2018 (12:23 IST)
నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా రూపొందుతోన్న ఎన్టీఆర్ బ‌యోపిక్ ఈరోజు సెట్స్ పైకి వెళ్లింది. జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాపై అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ భార్య‌గా బాలీవుడ్ భామ విద్యాబాల‌న్ న‌టిస్తున్న‌ట్టు ఇప్ప‌టివ‌ర‌కు వార్త‌లు వ‌చ్చాయి. బాలీవుడ్ సినీ విశ్లేష‌కుడు త‌ర‌ణ్ ఆద‌ర్శ ట్విట్ట‌ర్లో స్పందిస్తూ.. విద్యాబాల‌న్ ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో న‌టిస్తున్న‌ట్టు క‌న్ఫ‌ర్మ్ చేసారు.
 
ఇదిలా ఉంటే... ఈ మూవీ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... నంద‌మూరి బాల‌కృష్ణ వార‌సుడు మోక్ష‌జ్ఞ ఈ సినిమా ద్వారా సినీ రంగ ప్ర‌వేశం చేయ‌బోతున్నాడ‌ట‌. కాక‌పోతే మోక్ష‌జ్ఞ చాలా లావు అయ్యాడ‌ట‌. వెంట‌నే లావు త‌గ్గమ‌ని క్రిష్ చెప్ప‌డంతో ప్ర‌స్తుతం ఆ ప‌నిలో ఉన్నాడ‌ట‌. ఈ సినిమా ద్వారా మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఇస్తే ఇక బాల‌య్య అభిమానుల‌కు పండ‌గే. 1983 జనవరి 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అందుచేత‌ ఈ చిత్రాన్ని 2019 జనవరి 9న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌. తొలి షాట్లో బాలయ్య సీఎంగా ప్రమాణం చేయడం వుంటుందని సినీజనం చెప్పుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''శివగామి'' పేరిట వెబ్‌సిరీస్.. రాజమౌళి పర్యవేక్షణలో దేవ్ కట్టా?