Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిల్మ్ రికార్డులు మటాష్... ఫస్డ్ డే రూ.100 కోట్లు : నెంబర్లు పట్టేలా స్పేస్ కావాలి.. కరణ్ జొహార్

భారతీయ చలనచిత్ర రికార్డులన్నీ బద్ధలైపోయాయి. దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన దృశ్యకావ్యం "బాహుబలి-2" దేశ చలన చిత్ర రికార్డులను తిరగరాస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ చిత్రాలు "సుల్తాన్", "దంగల్" సృష్టించిన ర

Advertiesment
ఫిల్మ్ రికార్డులు మటాష్... ఫస్డ్ డే రూ.100 కోట్లు : నెంబర్లు పట్టేలా స్పేస్ కావాలి.. కరణ్ జొహార్
, ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (06:56 IST)
భారతీయ చలనచిత్ర రికార్డులన్నీ బద్ధలైపోయాయి. దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన దృశ్యకావ్యం "బాహుబలి-2" దేశ చలన చిత్ర రికార్డులను తిరగరాస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ చిత్రాలు "సుల్తాన్", "దంగల్" సృష్టించిన రికార్డులు కనుమరుగయ్యాయి. 
 
ఈ చిత్రం విడుదలైన తొలిరోజే ఒక్క భారత్‌లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్ళను రాబట్టినట్టు సమాచారం. ‘బాక్స్ ఆఫీస్ ఇండియా’ కథనం ప్రకారం... తొలిరోజు ఒక్క హిందీ వెర్షన్‌లోనే బాహుబలి రూ.40 కోట్లు, నైజాం/ఆంధ్రా - రూ.45 కోట్లు, తమిళనాడు - రూ.14 కోట్లు, కర్నాటక రూ.10 కోట్లు, కేరళ రూ.4 కోట్లు చొప్పున వసూలు చేసినట్టు సమాచారం. 
 
కాగా, రెబల్‌స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా తదితర తారలు నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా 6500 థియేటర్లలో ఈనెల 28వ తేదీన రిలీజైన విషయం తెల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా 9 వేలకి పైగా స్కీన్లపై ప్రదర్శితమవుతోంది. భారతదేశంలో ఇప్పటివరకు ఏ సినిమా సాధించలేని ఘనతను సొంతం చేసుకుంటూ.. బాక్సాఫీసు వద్ద రోజుకో రికార్డును సృష్టిస్తోంది. 
 
బాక్సాఫీసు వద్ద అధికారిక లెక్కలపై బాలీవుడ్ నిర్మాత కరణ జోహార్ ట్విటర్లో స్పందిస్తూ... ‘‘ఆలోచనలకు, ఊహకు అందనంత అత్యధిక వసూళ్లు సాధించిన డే-1 ఇది.. ఇప్పుడే సమాచారం సేకరిస్తున్నాం... త్వరలోనే వివరాలు చెబుతాం.. నెంబర్లు పట్టేలా ఖాళీ (స్పేస్) చూసుకోవాలి ’’ అని వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్కసారి గాలి పీల్చి వదలండి....