Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''సాహో'' నుంచి డార్లింగ్ చెప్పిన సర్‌ప్రైజ్ వచ్చేసింది..

Advertiesment
''సాహో'' నుంచి డార్లింగ్ చెప్పిన సర్‌ప్రైజ్ వచ్చేసింది..
, మంగళవారం, 21 మే 2019 (13:15 IST)
బాహుబలి హీరో ప్రభాస్ తాజాగా సాహోలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సాహో నుంచి అధికారిక పోస్టర్ రిలీజ్ అయ్యింది. సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ నటీమణి శ్రద్ధా కపూర్ నటిస్తోంది. నీల్ నితిన్ ముకేష్, లాల్, అరుణ్ విజయ్, వెన్నెల కిషోర్ తదితరులు నటించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో సాహో నుంచి ప్రభాస్ లుక్ విడుదలైంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదుదిదుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో మే 21వ తేదీన డార్లింగ్స్.. సర్ ప్రైజ్ వుందని ఓ వీడియోను ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. 
 
తాజాగా సాహో నుంచి ప్రభాస్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ రిలీజ్ కానుంది. బాహుబలి-2 తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐశ్వర్య మీమ్.. వివేక్ ఓబెరాయ్‌కు మతి చెడింది.. ఊర్మిళ