Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

Advertiesment
Arjun Chakravarthy Team

దేవీ

, సోమవారం, 28 జులై 2025 (18:10 IST)
Arjun Chakravarthy Team
విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి'. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఈ రోజు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హను రాఘవపూడి సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. ఓ కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా ఈ మూవీ టీజర్ విడుదలైంది.
 
అనంతరం డైరెక్టర్ విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ, నేను 12 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు ఒక పర్సన్ ని కలిసాను. ఆ పర్సన్ పేరు అర్జున్ చక్రవర్తి. ఆయన దగ్గర నేను కబడ్డీ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆయన ఒక కథ చెప్పారు. అది నా మనసులో నాటుపోయింది. ఆ కథని ఎలాగైనా ప్రపంచానికి చెప్పాలని భావించా. అలా ఈ కథ నేను డైరెక్టర్ కావడానికి డ్రైవ్ చేసింది. నిర్మాత శ్రీని గారికి కథ చెప్పిన తర్వాత ఆయనకి నచ్చింది. వెంటనే ఓకే చెప్పారు. 
 
ఈ సినిమాని 120 లొకేషన్స్ లో షూట్ చేశాం. మా హీరో విజయ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. డిఓపి జగదీష్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసాడు. మేము అనుకున్నది తీయడానికి ఎంతకైనా సాహసించారు. సినిమాలో మ్యూజిక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉంటుంది. మా హీరోయిన్ సిజ్జా రోజ్ చాలా హార్డ్ వర్క్ చేసింది. సినిమా కోసం తెలుగు కూడా నేర్చుకుంది. ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంటుంది. ఇది నా ప్రామిస్'అన్నారు.
 
హీరో విజయరామరాజు మాట్లాడుతూ, మ్యూజిక్. విజువల్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. హీరోయిన్ సిజ్జా ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. నేను ఏడాదిన్నర పాటు ప్రో కబడ్డీ టీమ్స్ తో ట్రావెల్ అయ్యి రియల్ గా గేమ్ నేర్చుకుని ఈ సినిమా చేయడం జరిగింది.  బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం సిక్స్ ప్యాక్ చేయాల్సి వచ్చింది. నా జీవితంలో గుర్తుండిపోయే సినిమా ఇది. ఇంత  మచి క్యారెక్టర్ ఉన్న సినిమా రావడం చాలా అరుదు అన్నారు
 
ప్రొడ్యూసర్ శ్రీని గుబ్బల మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది.  ఈ సినిమా కథ చెప్పినప్పుడు గానీ తీస్తున్నప్పుడు గానీ ఎక్కడ కూడా డ్రాప్ అయినట్లు అనిపించలేదు అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్