Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లైంగిక వేధింపుల్లో ఆ పేరు విని షాకయ్యా : ఏఆర్ రెహ్మాన్

Advertiesment
AR Rahman
, మంగళవారం, 23 అక్టోబరు 2018 (16:13 IST)
మీటూ ఉద్యమంలో భాగంగా పలువురు ప్రముఖులపై లైంగిక ఆరోపణలు రావడంపై ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్పందించారు. ఇదే అంశంపై ఆయన ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్‌లోని అంశాలను పరిశీలిస్తే, 
 
'మీటూ మూవ్‌మెంట్‌ని గ‌మ‌నిస్తూనే ఉన్నాను. కొందరి పేర్లను విని తాను చాలా షాక్‌కి గురయ్యాను' అని రెహ్మాన్ వెల్లడించారు. క్లీన్‌, మహిళలను గౌరవించే ఇండస్ట్రీని నాకు చూడాలని ఉంది. మ‌హిళ‌లు తాము ఎదుర్కొన్న వేధింపులను బహిర్గ‌తం చేసేందుకు ముందుకు వస్తున్న మహిళలకు మరింత శక్తినివ్వాలి. మంచి వాతావరణాన్ని సృష్టించేందుకు మేమంతా కృషి చేస్తాం. బాధితులు తమ బాధను వ్యక్త పరిచేందుకు సోషల్ మీడియా మంచి ఫ్రీడమ్‌ని కల్పిస్తోంది. ఒకవేళ అది దుర్వినియోగమైతే.. మనం కొత్త ఇంటర్నెట్ జస్టిస్ సిస్టమ్‌ను క్రియేట్ చేయడంతో జాగ్రత్త వహించాలి' అని రెహ్మాన చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
కాగా, బాలీవుడ్‌లో మొదలైన ఈ మీటూ ఉద్యమం ఇపుడు కోలీవుడ్‌ను కుదిపేస్తోంది. ముఖ్యంగా, ప్రముఖ సినీ కవి, గేయ రచయిత వైరముత్తుపై పలువురు గాయనీమణులు లైంగిక ఆరోపణలు చేయడం ఇపుడు సంచలనంగా మారింది. ఈ అంశంపై రెహ్మాన్ సోదరి రెహానా కూడా మీటూ ఉద్యమానికి మద్దతుగా నిలించారు. పైగా, గాయని చిన్మయి శ్రీపాద చేసిన ఆరోపణలతో ఏకీభవించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు