Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుశాంత్ సింగ్ నెలమాసికం... 'చైల్డ్ ఆఫ్ గాడ్' అంటూ మాజీ ప్రియురాలు ట్వీట్

Advertiesment
సుశాంత్ సింగ్ నెలమాసికం... 'చైల్డ్ ఆఫ్ గాడ్' అంటూ మాజీ ప్రియురాలు ట్వీట్
, మంగళవారం, 14 జులై 2020 (17:35 IST)
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం తీర‌ని విషాదాన్ని మిగిల్చింది. జూన్ 14న ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకోగా, నేటితో నెల రోజులు పూర్తైంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అభిమానులు, శ్రేయోభిలాషులు, స‌న్నిహితులు సుశాంత్‌కి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. 
 
అయితే ఇప్ప‌టి వ‌ర‌కు సుశాంత్ మృతిపై స్పందించని సుశాంత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండే మొదటిసారి సోష‌ల్ మీడియా ద్వారా స్పందించింది. అంకితం లోఖండే త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా దేవుడి ముందు ఉంచిన దీపం షేర్ చేస్తూ.. చైల్డ్ ఆఫ్ గాడ్ అని కామెంట్ పెట్టింది. 
 
ప్ర‌స్తుతం ఈ పోస్ట్ అంద‌రి దృష్టిని ఆకర్షిస్తుంది. కాగా, సుశాంత్ మ‌ర‌ణించిన త‌ర్వాత అంకిత త‌న త‌ల్లితో క‌లిసి ఆయ‌న ఇంటికి వెళ్లి కుటుంబ స‌భ్యుల‌ని ప‌రామ‌ర్శించిన విష‌యం తెలిసిందే. 2009లో హిందీలో ప్రారంభమైన పవిత్ర రిశ్తా (పవిత్ర సంబంధం) అనే టీవీ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమ‌య్యాడు సుశాంత్.
webdunia
 
ఏక్తా కపూర్ నిర్మించిన ఈ సీరియల్‌లో సుశాంత్ ప్రధాన పాత్ర పోషించి టీవీ ఆడియెన్స్‌ని మెప్పించాడు. ఇదే సీరియల్‌లో తనకి జోడీగా నటించిన అంకిత లోఖండేతో సుశాంత్‌ ప్రేమలో పడ్డాడు. దాదాపు ఆరేళ్లపాటు వీళ్ల ప్రేమాయణం కొనసాగింది. 2016లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ - అంకిత లోఖండే ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

CHILD Of GOD


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిన్ను కోల్పోయిన 30 రోజులు.. కానీ నిన్ను జీవితకాలం ప్రేమిస్తునే వుంటా?