Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Advertiesment
Ram, Bhagyashree Borse

దేవీ

, శుక్రవారం, 18 జులై 2025 (18:58 IST)
Ram, Bhagyashree Borse
రామ్ పోతినేని యూనిక్ ఎంటర్టైనర్ ఆంధ్రా కింగ్. మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి వివేక్ & మెర్విన్ సంగీతం అందించారు.  ఫస్ట్ ట్రాక్ నువ్వుంటే చాలే ప్రోమోస్ పాట పై చాలా బజ్ క్రియేట్ చేశాయి. మేకర్స్ లిరికల్ వీడియోను రిలీజ్ చేయడంతో మ్యూజిక్  ప్రమోషన్‌లను ప్రారంభించారు.
 
ప్రేమకు హార్ట్ బీట్ ఉంటే అది 'నువ్వుంటే చాలే' లాగానే వుంటుంది. ఈ మెస్మరైజ్ సాంగ్ ఫస్ట్ నోట్ నుంచే మనల్ని అలరిస్తోంది. మ్యూజికల్ మ్యాజిక్, ఆర్కెస్ట్రేషన్, అకౌస్టిక్స్ అద్భుతంగా వున్నాయి. ఇది వెంటనే ఆల్-టైమ్ ఫేవరెట్ లవ్ సాంగ్స్ ప్లేలిస్టు లో చేరుతుంది.  
 
రామ్ పోతినేని తొలిసారిగా లిరిక్ రైటర్ గా మారారు. నువ్వుంటే చాలే పాటలోని సాహిత్యం పోయెటిక్ గా వుంది. ప్రతి లైన్ మనసుని తాకుతుంది. ప్రేమ నిజమైన నిర్వచనాన్ని కనుగొనడానికి హీరో చేసే ప్రయాణంలా అనిపిస్తుంది. ప్రేమని నిర్వచించలేమని, కేవలం అనుభవించగలమని తెలియజేస్తోంది. ఈ పాట ఒక చిన్న కథలా అనిపిస్తుంది. ఇది భావోద్వేగాలతో ప్రయాణించే అనుభూతిని ఇస్తుంది.
 
రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ వోకల్స్ కట్టిపడేశాయి. కోరస్‌లోని వోకల్ లేయర్స్ అద్భుతంగా వున్నాయి. హుక్‌ ఫ్రేజ్ మెమరబుల్ గా వుంది. రియల్ లోకేషన్స్ షూట్ చేసిన ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లాగా కనిపిస్తుంది. రామ్ చర్మిషా, భాగ్యశ్రీ ఎలిగెన్స్ కలిసి, వారి కెమిస్ట్రీ  ప్రేమని అనుభూతి చెందేలా చేసింది.
 
రామ్ పోతినేని బ్యూటిఫుల్ లిరిక్స్, అనిరుధ్ రవిచందర్ మెస్మరైజింగ్ వాయిస్, వివేక్ & మెర్విన్ సోల్ ఫుల్ కంపోజిషన్ తో సాంగ్ హ్యుజ్ బ్లాక్ బస్టర్ అయ్యింది.
 
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తుండగా, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సిద్ధార్థ నుని, ఎడిటర్‌  శ్రీకర్‌ ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ అవినాష్‌ కొల్లా.
 
తారాగణం: రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్