Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండు ప్రేమ‌క‌థ‌లతో అందమైన లోకం- ప్రారంభం

Advertiesment
Andamaina lokam
, శుక్రవారం, 20 ఆగస్టు 2021 (18:28 IST)
Andamaina lokam opening
డాక్టర్ వెంకీ, వర్ష విశ్వనాథ్, చాందిని భగవాని నాయ‌కా నాయిక‌లుగా `అందమైన లోకం` రూపొందుతోంది. మోహన్ మర్రిపెల్లి  దర్శకత్వంలో డాక్టర్ రవీంద్ర నాయుడు నిర్మిస్తున్నారు. శుక్రవారం పూజ కార్యక్రమాలు అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత కూతురు సహస్ర హీరో, హీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, డాక్టర్ రవీంద్ర నాయుడు కెమెరా స్విచ్చాన్ చేశారు. చిత్ర దర్శకుడు మోహన్ మర్రిపెల్లి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
 
చిత్ర దర్శకుడు మోహన్ మరిపెల్లి మాట్లాడుతూ, నేను 100 కు పైగా షార్ట్ ఫిలిమ్స్ చేశాను. నిర్మాతకు ఈ కథ నచ్చడంతో నామీద నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాడు. మంచి బ్యూటిఫుల్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెండు ప్రేమ‌క‌థ‌లు ఉంటాయి. ప్రస్తుతం లవ్ లో ఉన్న వారు, లవ్ ఫెయిల్యూర్ అయినవారు కానీ, లవ్ లో పడాలి అనుకునే వారికి కానీ ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతూ మ‌లుపుల‌తో మంచి మెసేజ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగా ఉంటుంది. పాటలు బాగా వచ్చాయి. ప్రశాంత్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మంచి నటీనటులు తో చేస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.
 
నిర్మాత డాక్టర్ రవీంద్ర నాయుడు మాట్లాడుతూ, క‌థ విన్నాక‌ ఈ స్క్రిప్ట్ పై చాలా రోజులు ప‌ని చేశాము. ఫైనల్ గా స్క్రిప్ట్ అంతా అద్భుతంగా తయారు చేసుకొని మంచి టీంను సెలెక్ట్ చేసుకొని అంత ఒక యూనిటీతో ఈ సినిమా చేస్తున్నాము. మా బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుతున్నా అన్నారు.
 
హీరో డాక్టర్ వెంకీ మాట్లాడుతూ, రొటీన్ లవ్ స్టొరీ కాకుండా ప్రేక్షకులకు డిఫరెంట్ మూవీని పరిచయం చేద్దామని ఓ బ్యూటిఫుల్ లవ్ స్టొరీని తయారు చేసుకొన్నాం. ఈ కరోనా టైం లో లవ్ స్టొరీ కథలు చాలా వున్నా ఇలాంటి డిఫరెంట్ లవ్ స్టొరీ లో హీరోగా నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. హీరోయిన్లు చాందిని భగవాని, వర్ష విశ్వనాథ్, ఈ మూవీలో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంద‌న్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ లేకుంటే క‌లెక్ష‌న్లు పెద్ద స్థాయిలో వుండేవిః అభిషేక్ అగ‌ర్వాల్‌. వివేక్ కూచిబొట్ల