Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాంక‌ర్‌లు సింగ‌ర్‌లు ఎలా సంపాదిస్తారో తెలుసా! క్రేజీ అంకుల్స్‌- ఆద‌ర‌ణ చూసి వెన‌క‌డుగు వేసిన మ‌హిళాసంఘాలు

Advertiesment
యాంక‌ర్‌లు సింగ‌ర్‌లు ఎలా సంపాదిస్తారో తెలుసా!   క్రేజీ అంకుల్స్‌-  ఆద‌ర‌ణ చూసి వెన‌క‌డుగు వేసిన మ‌హిళాసంఘాలు
, గురువారం, 19 ఆగస్టు 2021 (18:46 IST)
Crazy Uncles
క్రేజీ అంకుల్స్ సినిమా నిలిపివేయాల‌ని తెలంగాణ మహిళా హక్కుల వేదిక డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే. అధ్యక్షురాలు రేఖ, కార్యదర్శి.బి రత్న బుధ‌వారంనాడు ప్రెస్‌మీట్‌లో క్రేజీ అంకుల్స్ సినిమా ట్రైలర్ లోనే మహిళలను కించ పరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు, మహిళ లను ఆట వస్తువు గా చూపారంటూ ధ్వ‌జ‌మెత్తారు. స‌భ్య‌స‌మాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను నిల‌దీశారు.
 
క‌ట్ చేస్తే, మ‌రుస‌టిరోజు అంటే గురువారంనాడు హైద‌రాబాద్‌లో మూసాపేట‌లోని రాముల‌య్య థియేట‌ర్‌లో సినిమా ప్ర‌ద‌ర్శిత‌మైంది. 11గంట‌ల‌కు ఆట‌కు ప్రేక్ష‌కులు వ‌స్తారేమోన‌ని థియేట‌ర్ యాజ‌మాన్యం ఎందురు చూసింది. అయితే సినిమా ప్రారంభ‌మ‌య్యే స‌మ‌యానికి 35 మంది థియేట‌ర్ల‌లో అక్క‌డ‌క్క‌డా కూర్చుని వున్నారు. ఈలోగా ప‌ది మంది మ‌హిళా సంఘాల‌కు చెందిన వారు వ‌చ్చారు. వారంతా నిల‌బ‌డే సినిమాను చూశారు. కానీ ఎటువంటి రాద్దాంతం చేయకుండానే వెనుతిరగాల్సి వ‌చ్చింది. అందుకు కార‌ణం ప్రేక్ష‌కాద‌ర‌ణ లేక‌పోవ‌డ‌మే. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు స‌త్తిబాబు, న‌టుడు రాజారవీంద్ర హాజ‌రై తిల‌క‌రించారు.
 
సినిమాలో ఏముందంటే!
ఫైన‌ల్‌గా ఈ సినిమా ఓ బూతు సినిమా అని చూసిన‌ ప్రేక్ష‌కులు తేల్చారు. అందులో చాలా డైలాగ్‌లు బూతు డైలాగ్‌లే వున్నాయి. శ్రీ‌ముఖి ఓ యాంక‌ర్‌. ముగ్గురు అంకుల్స్ ఇంటిలో పోరు భ‌రించ‌లేక ఈమెకు ఎట్రాక్ట్ అవుతారు. ఆమె మేనేజ‌ర్ ను సంప్ర‌దిస్తారు. గంట‌ల‌కు 5ల‌క్ష‌లు డిమాండ్ చేస్తాడ‌త‌ను. అలా వీరుకూడా వెళ్లి ఆమెను బుక్ చేసుకుంటారు. 
 
వీరు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ఆమె పొందుకోసం రూమ్‌కు వెళ‌తారు. స‌రిగ్గా ఆ టైంలో క‌రెంట్ పోతుంది. క‌ట్‌చేస్తే కొద్దిరోజుల‌కు ఆమె గ‌ర్భ‌వ‌తి అని రిపోర్ట్ వ‌స్తుంది. ఇక ఆమె వీరిని బ్లాక్ మెయిల్ చేస్తుంది. వారి ఆస్తుల్ని రాయించుకుని వాటిని ఓ అనాథ‌శ్ర‌మానికి ఇచ్చేస్తుంది. ఫైన‌ల్‌గా వీరు మంచివారు అని ఆ కాల‌నీవారికి చెబుతుంది శ్రీ‌ముఖి. ఇంత‌కీ ఈ ముగ్గురు అంకుల్స్ రాత్రి పూట రూమ్ కు వెళ్ళి ఎంజాయ్ చేసింది శ్రీ‌ముఖి అసిస్టెంట్‌తోనే. ఇది పెద్ద ట్విస్ట్ అనుకుని ద‌ర్శ‌క నిర్మాత‌లు తీశారు. కానీ ఇలాంటి క‌థ‌ల‌తో బాలీవుడ్‌లో ఎప్పుడో వ‌చ్చేశాయి.
 
యాంక‌ర్లు, సింగ‌ర్లు ల‌గ్జ‌రీగా ఇలా బ‌తుకుతారు!
స‌హ‌జంగా కామ‌న్‌మెన్‌కు తెలిసిన పాయింటే. మ‌హిళా యాంక‌ర్లు, సింగ‌ర్లు ఒక్కసారిగా ఆస్తులు ఎలా సంపాదిస్తారో తెలుసా, కారులో ఎలా తిరుగుతున్నారో తెలుసా.. అంటూ మేనేజ‌ర్ చెప్పిన నిజాలే. డ‌బ్బులు సంపాదించాలంటే మేనేజ‌ర్లే ఇలా లేడీస్‌తో సిట్టింగ్‌లు, మందు పార్టీలు చేయిస్తారంటూ గొప్ప ర‌హ‌స్యాన్ని ఈ సినిమాలో చెప్పారు. బ‌హుశా జ‌నాల‌కు తెలీని నిజ‌మ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించి సినిమా తీసిన‌ట్లున్నారు ఇప్ప‌టి వ‌ర‌కు శ్రీ‌ముఖిని ఒక కోణంలో చూశారు. మ‌రి ఈ సినిమాలో మ‌రో కోణంలో చూపించిన‌ట్ల‌యింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెప్టెంబరులో బిగ్‌బాస్-5- కంటెస్టెంట్స్ వీళ్ళే