Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాస్త పద్ధతి పాటించండి అనసూయ మేడం... నెటిజన్లు ట్రోలింగ్...

Advertiesment
కాస్త పద్ధతి పాటించండి అనసూయ మేడం... నెటిజన్లు ట్రోలింగ్...
, మంగళవారం, 7 మే 2019 (21:33 IST)
అనసూయ అనగానే రంగస్థలం రంగమ్మత్తగానూ, జబర్దస్త్ షోలో హీటెక్కించే యాంగర్‌గానూ తెలుసు. అప్పుడప్పుడు హాటెస్ట్ ఫోటోలు షేర్ చేసే అనసూయ ఈసారి మరో పిక్ షేర్ చేసి చర్చకు దారి తీసింది. ఇంతకీ ఆమె షేర్ చేసిన ఫోటో ఏంటయా అంటే తన భర్తకు వెనుక వైపు నుంచి మెడపై మసాజ్ చేస్తూ వున్న ఫోటో.
 
మసాజ్ చేస్తూ చేతుల వరకే వున్న ఫోటో అయితే ఫర్లేదు కానీ ఓ షర్ట్ ధరించి తన థైస్‌ కనబడేటట్లుగా వున్న ఫోజును షేర్ చేసింది. ఆ ఫోటోను తన కుమారుడు అయాన్స్ తీశాడనీ, ఇంత అందమైన ఫ్యామిలీ తన అదృష్టమనీ ఫోటో కింద కామెంట్ పెట్టింది. 
 
కానీ ఆ ఫోటోను చూసిన నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దయచేసి కాస్త పద్ధతి పాటించండి మేడం.. ఇలాంటి ప్రైవేట్ ఫోటోలను షేర్ చేయవద్దు ప్లీజ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరొకరైతే... బయటే అనుకున్నాం మీ ఇంట్లో కూడా వేసుకోవడానికి బట్టలు లేవా అంటూ కామెంట్ చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మహర్షి' మూవీ అప్‌డేట్స్ :: తీపి కబురు.. చేదువార్త... ఫ్యాన్స్ షాక్