Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెగా ప‌వ‌ర్ స్టార్ చ‌ర‌ణ్ బాట‌లో స్టైలీష్ స్టార్..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ మూవీస్ కాకుండా ఎక్స్‌పెరిమెంట్స్ చేయాల‌నుకుంటున్నాడు. అందుక‌నే రోటీన్‌కి భిన్నంగా ధృవ సినిమా చేశాడు. ఆత‌ర్వాత 1980 గ్రామీణ నేప‌ధ్యంలో రంగ‌స్థ‌

Advertiesment
మెగా ప‌వ‌ర్ స్టార్ చ‌ర‌ణ్ బాట‌లో స్టైలీష్ స్టార్..!
, బుధవారం, 11 ఏప్రియల్ 2018 (10:42 IST)
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ మూవీస్ కాకుండా ఎక్స్‌పెరిమెంట్స్ చేయాల‌నుకుంటున్నాడు. అందుక‌నే రోటీన్‌కి భిన్నంగా ధృవ సినిమా చేశాడు. ఆత‌ర్వాత 1980 గ్రామీణ నేప‌ధ్యంలో రంగ‌స్థ‌లం సినిమా చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన రంగ‌స్థ‌లం ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో తెలిసిందే. 
 
ప్రస్తుతం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చ‌ర‌ణ్ బాట‌లో ఎక్స్‌పెరిమెంట్స్ చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ న‌టిస్తోన్న సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా మే 4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా త‌ర్వాత బ‌న్నీ చేయ‌నున్న సినిమా ఏంటి అనేది ఇంకా ఫైన‌ల్ కాలేదు.
 
అయితే... రోటీన్‌కి భిన్నంగా ప్ర‌యోగాలు చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. అందుక‌నే క్రిష్‌తో క‌లిసి సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌నే టాక్ వినిపిస్తోంది. క్రిష్ ప్ర‌స్తుతం మ‌ణిక‌ర్ణిక అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ త‌ర్వాత ''అహం బ్ర‌హ్మాస్మి'' అనే సినిమా చేసేందుకు క్రిష్ క‌థ రెడీ చేసాడు. 
 
క‌థప‌రంగా, క్యారెక్ట‌ర్ ప‌రంగా బ‌న్నీకి క‌రెక్ట్‌‍గా స‌రిపోతుందని అనుకుంటున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే బ‌న్నీకి క్రిష్ క‌థ చెప్ప‌నున్నాడ‌ని స‌మాచారం. వీరిద్ద‌రు క‌లిసి వేదం అనే సినిమా చేసారు. మ‌రి... ఈసారి బ‌న్నీతో క్రిష్ "అహం బ్ర‌హ్మాస్మి'' అంటూ ప్ర‌యోగం చేస్తాడేమో చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీరెడ్డి లీక్స్: దిల్‌రాజు పోతే శని వదిలిపోతుంది.. అభిరామ్ ఎలా ముద్దెట్టుకున్నాడో?