టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ ఇటీవల శాకుంతలం అనే ఓ పౌరాణిక చిత్రాన్ని రూపోందిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. సమంత ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఓ కీలకపాత్రలో నటించనుందని ప్రకటించింది చిత్రబృందం. అల్లు అర్హ ఈ సినిమాలో చిన్నారి ప్రిన్స్ భరతుడి పాత్రలో కనిపించనుందట.
దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇక ఈ మేరకు అర్హ సెట్స్‌లో చేరనుంది. ఆమె 10 రోజుల పాటు శాకుంతలం షూటింగ్‌లో పాల్గొంటుందట. ఈ సినిమా మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల అద్భుతమైన, అందమైన ప్రేమ కథ ఆధారంగా రూపోందుతుంది.
ఇందులో మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటిస్తున్నారు. కేరళలో ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు దేవ్ మోహన్. పాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్న ఈ సినిమాను గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిచనున్నారు.
గుణ శేఖర్ శాకుంతలం కంటే ముందు హిరణ్య కశిప అనే ఓ భారీ సినిమాను ప్రకటించారు. ఆయన ఎప్పటినుండో ఈ సినిమాను తెరకెక్కించాలనీ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా రానా ప్రధాన పాత్రలో ఈ సినిమాను ప్రకటించారు కూడా.
పురాణాలలో శివ భక్తుడు ప్రహ్లాద, రాక్షస రాజు హిరణ్యకశిపుడు మధ్య జరిగే సన్నివేశాలతో గుణ శేఖర్ ఈ కథను అల్లుకున్నారు గుణశేఖర్. ఐతే ప్రాజెక్ట్ ప్రకటించి చాలాకాలం అవుతున్నా.. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈ నేపథ్యంలో గుణ శేఖర్ సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం అనే సినిమాను మొదలు పెట్టారు.