Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెట్రిమారన్ విడుతలై పార్ట్ 1ను తెలుగులో విడుదల చేయనున్న అల్లు అరవింద్

Vidutalai Part 1 team with  Allu Aravind
, మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (19:18 IST)
Vidutalai Part 1 team with Allu Aravind
అల్లు అరవింద్ ఎప్పుడూ  ట్రెండ్ కంటే  రెండడుగులు ముందుంటారు.  గొప్ప సినిమాల విషయంలో మంచి నిర్ణయాలను తీసుకోవడం ఆయనకు అలవాటే.  ఒక గొప్ప చిత్రం ఏ భాషలో రిలీజైన దానిని తెలుగు ప్రేక్షకులకు అందించడానికి ఆయన ముందుంటారు. అల్లు అరవింద్ ఇటీవల తెలుగు ప్రేక్షకుల కోసం సూపర్‌హిట్ డబ్బింగ్ సినిమాలను థియేటర్లలో విడుదల చేయడం ద్వారా కొత్త ట్రెండ్‌ను ప్రారంభించారు. 
 
కన్నడ లో బ్లాక్ బస్టర్ అయిన కాంతార తెలుగులో విడుదల చేశారు. అది ఇక్కడ పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో "గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ విడుదల చేశారు. అదే పంథాలో అల్లు అరవింద్  సూపర్‌హిట్‌గా నిలిచిన సినిమాలను  "గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా తెలుగులో విడుదల చేశారు. ఇప్పుడు తెలుగులో మరో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు . 
 
మావెరిక్ ఫిల్మ్ మేకర్ వెట్రిమారన్ రచించి, దర్శకత్వం వహించిన చిత్రం విడుతలై పార్ట్ 1. ఈ  పీరియాడిక్ పోలీస్ ప్రొసీజర్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం మార్చి 31న తమిళనాడు అంతటా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.విడుతలై పార్ట్ 1 అభిమానులు నుండి భారీ స్పందన మరియు విమర్శకుల ప్రశంసలను పొందింది.
 
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, సూరి కథానాయకులుగా నటించారు. థియేటర్లలో విడుదలయ్యాక, ప్రశంసలు మరియు బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న ఈ చిత్రం. దక్షిణ-భారత చలనచిత్రాలు అన్ని భాషల ప్రేక్షకులపై  ప్రభావాన్ని చూపుతున్నాయి.  తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఒక మంచి సినిమాను ఆదరిస్తారు. ఇదివరకే  "గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా రిలీజైన కాంతార, మాలికాపురం వంటి సినిమాలకు బ్రహ్మరధం పట్టారు. ప్రస్తుతం  ఈ సినిమా తెలుగు విడుదల కోసం వెట్రిమారన్  అభిమానులు  ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
 
వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని RS ఇన్ఫోటైన్‌మెంట్ మరియు గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌లపై ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. ఆర్ వేల్‌రాజ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసారు.  లెజెండరీ మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి  సౌండ్‌ట్రాక్‌ను కంపోజ్ చేశారు. ఈ చిత్రం స్క్రీన్‌ప్లే సహ రచయిత అయిన బి జయమోహన్‌ తునైవన్ ఆధారంగా రూపొందించబడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

CITADEL ట్రైలర్‌ లాంఛ్.. భారతీయ వెర్షన్ కోసం వెయిటింగ్.. ప్రియాంక చోప్రా