Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

త్రివిక్రమ్ కథ పవన్ కళ్యాణ్ హీరో డైరెక్టర్ సుధీర్ వర్మ

Director Sudhir Varma
, మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (19:07 IST)
Director Sudhir Varma
రవితేజ  చిత్రం రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మించారు. హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా సినిమా రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో దర్శకుడు సుధీర్ వర్మ రావణాసుర విశేషాలని విలేకరులు సమావేశంలో పంచుకున్నారు.
 
అసలు ‘రావణాసుర’ ఎలా వుంటుంది ?
‘రావణాసుర’ సూపర్ ఎక్సయిటెడ్ గా వుంటుంది. సినిమాలో థ్రిల్స్, షాకింగ్ ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణగా వుంటాయి. అందులో ఏది రివిల్ చేసినా సినిమా చూసినప్పుడు ఆ థ్రిల్ వుండదు. ప్రేక్షకుడికి థ్రిల్లింగ్ అనుభూతిని ఇవ్వడానికే దానిని హోల్డ్ చేస్తున్నాం. 
 
రవితేజ గారితో థ్రిల్లర్ జోనర్ సినిమా చేయాలని ఆలోచన ఎలా వచ్చింది ?
రవితేజ గారికి ఫలానా జోనర్ సినిమా చేయాలని ముందుగా ఏమీ అనుకోలేదు. అయితే శ్రీకాంత్ కథ చెప్పిన్నపుడు రవితేజ గారికి నచ్చి, నేనైతే బావుంటుదని నా దగ్గరికి పంపించారు. కథ విన్నప్పుడు నాకు ఎక్సయిటింగా అనిపించింది. ఇలాంటి థ్రిల్లర్ ని ఓ పెద్ద హీరో చేయడం ఇంకా ఎక్సయిటెడ్ గా అనిపించింది. రావణాసుర వంద శాతం కొత్త జోనర్ మూవీ. ఇలాంటి కథ ఇప్పటివరకూ తెలుగులో రాలేదు. సినిమాపై చాలా నమ్మకంగా వున్నాం.
 
తెలుగు సినిమాల్లో ఒక హ్యాపీ ఎండింగ్, హీరో పాజిటివ్ షెడ్ వుంటుంది కదా.. కానీ ఇందులో మీరు ఫ్లిప్ చేసినట్లుగా వున్నారు?
మీరు మళ్ళీ కథలోకి వెళ్తున్నారు. (నవ్వుతూ) మీరు అన్నట్టుగా ఆ ఫ్లిప్ ఏమిటనేది మీరు వంద శాతం తృప్తి పడతారు. సినిమా చూసిన తర్వాత మన సెన్సిబిలిటీస్ మిస్ అయిన ఫీలింగ్ మీకు రాదని నా నమ్మకం.
 
 పుష్ప, కేజీఎఫ్.. ఇలా గత రెండేళ్ళుగా హీరోలని గ్రే షేడ్స్ లో చూపించడం ట్రెండ్ గా మారింది కదా ?
గ్రే షేడ్స్ అనేది చాలా కాలంగా వుంది. అంతంలో నాగార్జున, సత్యలో జేడీ ఇవన్నీ గ్రేనే కదా. ఇవి ఎప్పటి నుంచో వున్నాయి. అయితే ఈ మద్య అవి ఎక్కువగా పెరిగాయి.
 
ఇందులో చాలా మంది నటీనటులు వున్నారు కదా.. ప్యాడింగ్ బరువైనట్లు అనిపించలేదా ?
కథలో ఇంతమంది వున్నారు .. ఏం చేస్తారు ? అనే క్యురియాసిటీనే కావాలి . చూసినపుడు మీకు అర్ధమౌతుంది. ప్రతి పాత్ర కీలకంగా కథలో భాగంగా వుంటుంది.  సర్ ప్రైజ్, షాక్, థ్రిల్లు ఈ మూడు ఎలిమెంట్స్ తో అలరించే చిత్రమిది.
 
రావణాసుర పాత్ర మణిరత్నం గారి రావణ్ ని గుర్తు చేస్తుంది ?
మణిరత్నం గారు ఎగ్జాట్ గా రామాయణం తీశారు. అయితే ఇందులో నా హీరో పాత్రకి రావణాసుర  పేరు సరిగ్గా నప్పుతుంది. అలా అని నేను రామాయణంలోకి వెళ్ళలేదు. అయితే రావణాసుర అనే పేరు పెట్టిన తర్వాత దానికి తగ్గట్టు కొన్ని డైలాగులు యాప్ట్ అయ్యాయి, కొన్ని వాడుకున్నాం తప్ప రామాయణంతో సంబంధం లేదు.
 
వేరే రచయిత కథని డైరెక్ట్ చేయడం ఎలా వుంటుంది ?
ఖచ్చితంగా ఒక సవాల్ వుంటుంది. నా కథ అయితే నా విజువల్ సెన్సిబిలిటీకి తగట్టు రాసుకుంటాను. ఏదైనా మార్పు చేయడం కూడా సులువుగా వుంటుంది. వేరే కథలో మార్పు చేసినప్పుడు ఆ మార్పు మిగతా ఏరియాల్లో ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందనేది రచయితతో కూర్చుని క్రాస్ చెక్ చేసుకోవాలి.
 
 మీరు ఎక్కువగా థ్రిల్లర్స్ చేయడానికి కారణం ?
నాకు క్రైమ్ జోనర్ మీద సినిమా రన్ చేయడం ఇష్టం. నాకు హోల్డింగ్ పాయింట్ కావాలి. తర్వాత ఏం జరుగుతుందని ఆడియన్ ఆసక్తిగా ఎదురుచూసేలా చేయడం నాకు బాగా ఇష్టం.
  
రావణాసుర మ్యూజిక్ సూపర్ హిట్ అయ్యింది. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి ?
సినిమా ప్రారంభంలోనే హర్షవర్ధన్ తో నేపధ్యం సంగీతం, భీమ్స్ తో పాటలు చేయించాలని అనుకున్నాం. హర్ష రావణాసుర టైటిల్ సాంగ్ చేశాడు. చాలా బాగా వచ్చింది. తర్వాత రిమిక్స్ పాట కూడా బాగా చేశాడు. భీమ్స్ డిక్కా డిష్యు పాట చేశారు. 
 
 రావణాసురని అన్ని భాషల్లో విడుదల చేయాలనే ఆలోచన రాలేదా ?
ముందు అనుకున్నాం. హిందీ , తమిళ్ లో విడుదల చేయాలని అనుకున్నాం. కానీ వాళ్ళకి పదిహేను రోజులు ముందు కాపీ పంపించాలి. అయితే మేము ఏదైతే దాస్తూ వచ్చామో ఆ ఎలిమెంట్స్ బయటికి వచ్చేస్తాయనే భయంతో ముందు తెలుగులోనే విడుదల చేయాలని అనుకున్నాం. సెకండ్ వీక్ నుంచి హిందీ ప్లాన్ చేస్తున్నాం.
 
పవన్ కళ్యాణ్ గారితో సినిమా గురించి ?
అది త్రివిక్రమ్ గారి కథతో వుంటుంది. అయితే అది ఎప్పుడు ఏంటి అనేది త్వరలో తెలుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినిమా బావుంటే ఖచ్చితంగా థియేటర్ కి వస్తారు : నిర్మాత చిరంజీవి (చెర్రీ)