Pawan kalyan - Allu Aravind
మెగా ఫ్యామిలీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది ప్రత్యేకత శైలి. ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు, ఆ కుటుంబంలో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా ప్రత్యేకమైన మనస్తత్వం కలిగినవారు. తాజా ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. సనాతన ధర్మం గురించి రూపొదిన కన్నడ యానిమేషన్ సినిమా మహావతార్ నరసింహ చిత్రాన్ని అల్లు అరవింద్ తెలుగులో పంపిణీ చేస్తూ విడుదల చేశారు. ఈ సినిమా ప్రజాదరణ పొందుతోంది.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని అందరూ నమ్ముతారు. ఇక్కడ మీకు ఓ విషయం చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి. నాకు తెలిసిన వాళ్ళలోకానీ, సన్నిహితులలోకానీ, నా కుటుంబంలో కానీ పవన్ కు తెలిసినంత ఎవరీకీ తెలీదు. పవన్ కళ్యాణ్ సనాతన దర్మం గురించి మాట్లాడుతున్నారు.కనుక మనం తప్పనిసరిగా వారు ఈ సినిమ చూడాలని మీ ద్వారా కోరుతున్నాను అన్నారు.
అనంతరం... సనాధన ధర్మంతో కూడిన కథతో పవన్ కళ్యాణ్ పెట్టి సినిమా మీరు తీస్తారా? అని విలేకరి అడుగగా, తప్పకుండా చేస్తాను. వారితో సినిమా చేయాలని అనుకుంటున్నాను. అని బదులిచ్చారు. మరి అందుకు పవన్ కళ్యాణ్ రెడీగా వుంటారోలేదో చూడాలి.