Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల వైకుంఠపురంలో మ్యూజికల్ నైట్ సౌతిండియా రికార్డ్

Advertiesment
అల వైకుంఠపురంలో మ్యూజికల్ నైట్ సౌతిండియా రికార్డ్
, సోమవారం, 6 జనవరి 2020 (17:20 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం 2020, జనవరి 12న విడుదలవుతుంది. 
 
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జనవరి 6న యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో “అల వైకుంఠపురంలో..మ్యూజికల్ ఫెస్టివల్ ను ” వైభవంగా, వినూత్నంగా జరుపుతున్నారు.
 
“అల వైకుంఠపురంలో..మ్యూజికల్ ఫెస్టివల్ ఈవెంట్ ను శ్రేయస్ మీడియా డిఫరెంట్ గా ప్లాన్ చేసింది. 52 అడుగుల పొడవు, 162 అడుగుల వెడల్పుతో స్టేజి డెకరేట్ చేయనున్నారు. సౌత్ ఇండియాలో ఇంత భారీగా స్టేజ్ వెయ్యడం ఇదే మొదటిసారి. అలాగే ఈ ఫంక్షన్లో తమన్, శివమణి, సిద్ శ్రీరామ్, అర్మాన్ మాలిక్, రాహుల్ సిప్లిగoజ్, రోల్ రైడ, లేడి కాశ్, రాహుల్ నంబియర్, అనురాగ్ కులకర్ణి, ప్రియ సిస్టర్స్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. 
 
అలాగే ఎమ్.జె5 డాన్స్ , ఇండియన్ రాగా వారు స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి నటిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్‌తో త్రివిక్రమ్ సినిమా... ఈ వార్త నిజమేనా?