అల‌.. వైకుంఠ‌పుర‌ములో.. ప్రీ రిలీజ్ ప్లాన్స్ ఏంటి?

మంగళవారం, 17 డిశెంబరు 2019 (19:10 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అల‌.. వైకుంఠ‌పుర‌ములో, సూపర్ స్టార్ మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలు సంక్రాంతికి వ‌స్తుండ‌డంతో ఈ రెండు సినిమాల మ‌ధ్య ఎప్పుడూ లేనంత పోటీ ఏర్ప‌డింది. అందుక‌నే ఈ రెండు సినిమాల టీమ్స్ పోటీప‌డి మ‌రీ ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. ఫ‌స్ట్ బ‌న్నీ త‌న సినిమా ప్ర‌మోష‌న్స్‌ని స్టార్ట్ చేసి దూసుకెళ్లాడు. ఆ త‌ర్వాత మ‌హేష్ ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేసాడు. ఇప్పుడు మ‌హేష్ స్పీడు పెంచి ప్ర‌మోష‌న్స్ చేయ‌డంతో బ‌న్నీ టీమ్ కూడా ప్ర‌మోష‌న్స్ కోసం కొత్త ప్లాన్స్ రెడీ చేస్తుంది.
 
ఇలా.. స్టార్ హీరోలు పోటీప‌డి ప్ర‌మోష‌న్స్ చేస్తుండ‌టంతో ఇక అభిమానులు కూడా త‌మ హీరో సినిమా అప్డేట్ ఎప్పుడు వ‌స్తుందా అని ఎద‌రుచూస్తున్నారు. అల‌.. వైకుంఠ‌పుర‌ములో లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ఈ సినిమా ప్రీరిలీజ్‌ను మ్యూజిక‌ల్ నైట్ ఆఫ్ అల‌..వైకుంఠ‌పుర‌ములో అనే పేరుతో చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నార‌ని తెలిసింది. ఈ మ్యూజిక‌ల్ నైట్ ఒకచోట కాకుండా రెండుచోట్ల నిర్వ‌హిస్తార‌ని వార్త‌లు వస్తున్నాయి.
 
 ఎక్క‌డంటారా..? డిసెంబ‌ర్ 28న హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా ఫంక్ష‌న్ చేస్తార‌ట‌. ఈ మూవీ టీమ్‌తో పాటు చాలామంది సినీ ప్ర‌ముఖులు పాల్గొనేలా ప్లాన్ చేసార‌ట‌. ఆ త‌ర్వాత జ‌న‌వ‌రి 5న వైజాగ్‌లో మ‌రో ఫంక్ష‌న్ నిర్వ‌హిస్తార‌ని టాక్ వినిపిస్తోంది. అక్క‌డ కూడా అల‌.. వైకుంఠ‌పుర‌ములో టీమ్‌తో పాటుగా ఇండ‌స్ట్రీకి సంబంధించి చాలామంది సెల‌బ్రిటీలు పాల్గొంటార‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వర్మ బయోపిక్ తీస్తా, ఆర్జీవికి షాక్: ప్రముఖ రచయిత కసరత్తు