Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"2.O" చిత్రంలో హీరో నేను కాదు.. అక్షయ్ కుమార్ : రజినీకాంత్

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ అదే కాంబినేషన్‌లో సుభ

Advertiesment
Rajinikanth
, సోమవారం, 21 నవంబరు 2016 (17:05 IST)
సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ అదే కాంబినేషన్‌లో సుభాష్‌ కరణ్‌ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ '2.0'. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను ఆదివారం ముంబైలోని యశ్‌రాజ్‌ స్టూడియోలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. 
 
ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, హీరో అక్షయ్‌కుమార్‌, హీరో సల్మాన్‌ఖాన్‌, డైరెక్టర్‌ శంకర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎ.ఆర్‌.రెహమాన్‌, నిర్మాత సుభాష్‌ కరణ్‌, విఎఫ్‌ఎక్స్‌ వాల్ట్‌ జోన్స్‌, హీరోలు ఆర్య, విజయ్‌ ఆంటోనీ, సినిమాటోగ్రాఫర్‌ నిరవ్‌ షా, ఫైట్‌ మాస్టర్‌ సెల్వ, ప్రముఖ నిర్మాతలు ఎ.ఎం.రత్నం, బెల్లంకొండ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
ఇందులో ఈచిత్ర హీరో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మాట్లాడుతూ.. ''నిజం చెప్పాలంటే శంకర్‌తో వర్క్‌ చేయడం చాలా కష్టం. అతను ఓ పర్‌ఫెక్షనిస్ట్‌. కాబట్టే 25 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ ఇండియాలోని టాప్‌ డైరెక్టర్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. శంకర్‌తో కలిసి ఇంతకుముందు సినిమాలు చేసినా 2.0 అనేది ఇది 3డి మూవీ. 3డిలో నన్ను నేను చూసుకోవడం చాలా డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది. ఇక్కడ మీకో నిజం చెప్పాలి. అదేమిటంటే ఇందులో హీరో రజినీకాంత్‌ కాదు, అక్షయ్‌కుమార్‌ హీరో. క్యారెక్టర్‌ సెలెక్ట్‌ చేసుకునే అవకాశం నాకు ఇచ్చినట్టయితే అక్షయ్‌కుమార్‌ చేస్తున్న క్యారెక్టర్‌ని సెలెక్ట్‌ చేసుకునేవాడిని. హ్యాట్సాఫ్‌ టు అక్షయ్‌కుమార్‌. అతను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా రిలీజ్‌ తర్వాత అక్షయ్‌కుమార్‌ని దేశం మొత్తం అభినందిస్తుంది'' అని చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొడుక్కి, కోడలికి పడదటగా?