Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'గుడ్ టచ్.. బ్యాడ్ టచ్' అంటే ఏంటో ఆడపిల్లలకు చెప్పాలి : అదితి రావు హైదరీ

Advertiesment
Aditi Rao Hydari
, సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (10:06 IST)
తెలుగు అమ్మాయి అదితి రావు హైదరీ. పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లో. పెరిగింది ఉత్తర భారతంలో. తన సినీ కెరీర్ ఆరంభంలో బాలీవుడ్‌ పలు చిత్రాల్ల నటించింది. కానీ, నిలదొక్కుకోలేక పోయింది. ఆ తర్వాత ఆమె చూపు దక్షిణాదిపైవు మళ్లింది. తొలుత తెలుగు వెండితెరపై మెరిసింది. అదీ కూడా మణిరత్నం నిర్మించిన 'చెలియా' అనే డబ్బింగ్ చిత్రంతో అడుగుపెట్టింది. ఆ తర్వాత నారా రోహిత్ హీరోగా వచ్చిన 'సమ్మోహనం' చిత్రంతో ప్రతి ఒక్కరినీ సమ్మోహనపరిచింది. 
 
అయితే, బాల్యంలో తనకు ఎదురైన ఓ అనుభవంపై ఆమె స్పందిస్తూ, తనకు బాల్యంలోనే జరిగిన ఓ చెడు సంఘటనను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. '‌నేను స్కూల్లో లోకల్‌ ట్రైన్‌లో వెడుతున్న సమయంలో ఓ పెద్దాయన నన్ను బాడ్‌గా టచ్‌ చేస్తూ వెళ్ళబోయాడు. వెంటనే ఆయన్ని ఆపి, ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయకండి అంటూ వార్నింగ్‌ ఇచ్చాను' అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా, చిన్నవయస్సు నుంచి ఆడ పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటో పెద్దలు చెపుతుండాలని సలహా ఇచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఆర్పీఎఫ్ జవాన్ల మరణం వ్యక్తిగతంగా తీరని లోటు : విక్కీ కౌశల్