పవన్‌కు సారీ చెప్పిన శ్రీరెడ్డి... మీ నైజం ఇదీ అంటూ అర్థనగ్న ఫోటోలు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని నటి శ్రీరెడ్డి మరోమారు వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తెలుగు చిత్రపరిశ్రమలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని లీక్ చేస
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని నటి శ్రీరెడ్డి మరోమారు వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తెలుగు చిత్రపరిశ్రమలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని లీక్ చేసి ఒక్కసారిగా పాపులర్ అయిన నటి. ఆ తర్వాత తన పేరును శ్రీశక్తిగా మార్చుకుంది. ఈ క్రమంలో అనేకమైన ఊహించని పరిణామాలు సంభవించాయి. దీంతో ఆమె మిన్నకుండిపోయారు. అదేసమయంలో సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేసింది.
ఇంతకీ పవన్‌ను ఉద్దేశించి ఆమె చేసిన పోస్ట్ ఏమిటంటే.. 'వీరనారి విభాగం గురించి మాట్లాడుతూ.. మీరు ఒక మాట అన్నారు సార్. నేను నా సినిమాల్లో అర్థనగ్న(ఎక్స్‌పోజింగ్) సీన్స్‌కి అనుమతి ఇవ్వను. మహిళలు అంటే గౌరవం అని... గుర్తు చేద్దామని చిన్న ప్రయత్నం సార్.. సారీ' అంటూ పవన్ నటించిన కొన్ని సినిమాలలోని ఫొటోలను పోస్ట్ చేసింది. అయితే ఆమె చేసిన పోస్ట్‌పై నెటిజన్స్ మాత్రం చాలా ఘాటుగానే స్పందిస్తున్నారు. సినిమాలోని సన్నివేశాలు దర్శకుడి అభీష్టం మేరకు ఉంటాయనీ, ఆపాటి జ్ఞానంకూడా శ్రీరెడ్డికి లేదంటూ వారు మండిపడుతున్నారు.