Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నారా రోహిత్‌, శ్రీయా, సుధీర్ బాబు, శ్రీవిష్ణు మల్టీస్టారర్ "వీర భోగ వసంత రాయలు" ఫస్ట్ లుక్

నారా రోహిత్‌, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, శ్రీయ కాంబినేష‌న్లో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం వీర భోగ వసంత రాయలు. ఈ చిత్రాన్ని బాబా క్రియేష‌న్స్ ప‌తాకంపై, ఎంవికె రెడ్డి గారి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మిస్తున్నారు. ఇంద్ర‌సేన‌.ఆర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ

Advertiesment
నారా రోహిత్‌, శ్రీయా, సుధీర్ బాబు, శ్రీవిష్ణు మల్టీస్టారర్
, గురువారం, 12 జులై 2018 (22:36 IST)
నారా రోహిత్‌, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, శ్రీయ కాంబినేష‌న్లో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం వీర భోగ వసంత రాయలు. ఈ చిత్రాన్ని బాబా క్రియేష‌న్స్ ప‌తాకంపై, ఎంవికె రెడ్డి గారి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మిస్తున్నారు. ఇంద్ర‌సేన‌.ఆర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. 
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత అప్పారావు బెల్ల‌న మాట్లాడుతూ.. ఈ సినిమా ఇప్పటివరకు ఎవ్వరు చూడని విధంగా ఎవరు ఊహించని విధంగా డిఫరెంట్ గా ఉంటుంది. నేను ప్రొడ్యూసర్ గా వచ్చా అనేకంటే నేను ప్రొడ్యూసరుగా మారాను అనడం కరెక్ట్. ఈ ప్రపంచం మీదికి మా అమ్మానాన్న పంపిస్తే నన్ను నిర్మాతగా ఈ ప్రపంచానికి పరిచయం చేసింది డాక్టర్ ఎంవికె రెడ్డి గారు. ఈయనే నాకు బ్యాక్ బోన్.
 
సౌత్ ఆఫ్రికా, అమెరికాలో ఉన్న డాక్టర్ మాధవి డాక్టర్ నిరంజన్‌గారు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటా. ఇంద్ర ఎన్ని అవాంతరాలు వచ్చినా సినిమాను చాలా చక్కగా పూర్తి చేశాడు. మా హీరోలంతా నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు సినిమాకు చాలా హెల్ప్ చేశారు. చాలా సపోర్ట్ చేశారు. మా టెక్నిషియన్స్... అందరూ అన్నదమ్ముల్లాగా ఈ సినిమాను సపోర్ట్ చేశారు. 24 క్రాఫ్ట్స్‌కి చాలా థాంక్స్. అని అన్నారు 
 
ద‌ర్శ‌కుడు ఇంద్ర‌సేన.ఆర్ మాట్లాడుతూ.. నారా రోహిత్ శ్రీ విష్ణు గారికి చాలా థాంక్స్ నాకు బ్యాక్ బోన్ గా నిలిచారు. సుదీర్ బాబు గారికి శ్రీయ గారికి చాలా థాంక్స్. అప్పు సపోర్ట్ మర్చిపోలేను. చిన్నప్పుడు మా ఇంటి వెనకాల ఉన్న గుడిలో బ్రహ్మంగారి చరిత్ర రోజు వినేవాడిని.  అందులో వీర భోగ వసంత రాయలు గురించి విన్నాను. అది ఎందుకో నా మనసులో స్థిరంగా నాటుకుపోయింది. నేను ముందు స్టోరీ రాసుకున్నాను. ఆ తరవాత వీరభోగ వసంతరాయలు టైటిల్ కి కథకి బాగా కుదిరింది. సినిమాకు ఇదే బ్యాక్ బోన్ పాయింట్. పాపాలు పెరిగాయి... దాని చుట్టూనే కథ తిరుగుతుంది.  అందరికీ ఫస్ట్ లుక్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను అన్నారు.
 
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.... ఇదే స్టేజిమీద అప్పట్లో ఒకడుండేవాడు సినిమా ప్రమోషన్ మొదలుపెట్టాం. అప్పట్లో ఒకడుండేవాడు వెయ్యి సినిమాల్లో ఒక సినిమా. ఇప్పుడు వీరభోగ వసంతరాయలు సినిమాను మళ్ళీ తీయాలంటే అది కేవలం డైరెక్టర్ ఇంద్ర వల్లనే సాధ్యం అవుతుంది. ఇంద్ర చాలా మంచోడు. నాకు ఈ కథ చెప్పినప్పుడు ఈ పోస్టర్ లో ఉన్నట్టు నిలువుగా రెండు రోజులు అయిపోయాను. సినిమా చూసాక కూడా మీరు కూడా ఇలాగే పోతారు. సినిమా ప్రారంభమైన పదిహేను నిమిషాలకు ఇంగ్లీష్ సినిమా నా తెలుగు సినిమా నా అనే విషయం అర్థమవుతుంది ఈ సినిమా చూస్తే పిచ్చెక్కిపోతారు. 
 
ఈ సినిమాకు హీరో స్క్రీన్ ప్లే... హీరోయిన్ స్టోరీ... డైరెక్టర్ ఇంద్ర. ఈ సినిమాలో నారా రోహిత్ సుధీర్ బాబు శ్రియా సరన్ ఇలాంటి మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. మేము సినిమాల్లోకి వచ్చి ఎంత కష్టపడ్డామో ఇప్పటివరకు అంతకుమించి డైరెక్టర్ ఇంద్ర కష్టపడ్డాడు. నన్ను టార్చర్ పెట్టాడు. బెండు తీశాడు. కానీ అవుట్ ఫుట్ చూసుకున్నాక వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది త్వరలోనే టీజర్ ట్రైలర్ రిలీజ్ చేస్తాం అది చూశాక ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది మీకు అర్థమవుతుంది. అందరికీ చాలా థాంక్స్ అని అన్నారు.
 
హీరో నారా రోహిత్ మాట్లాడుతూ... ముందుగా ఈ పోస్టర్‌ని అద్భుతంగా తీర్చిదిద్దిన భానుకి స్పెషల్ థాంక్స్ సినిమాను రిఫ్లెక్ట్ చేసేది పోస్టర్స్. ఈ సినిమాలో హీరోలు అంటూ ఉండరు. ప్రతీ క్యారెక్టర్ హీరోనే ఈ సినిమాకు. ఇది ఎక్స్పరిమెంట్ సినిమా. మన తెలుగులో అయితే కచ్చితంగా ఇలాంటి సినిమా రాలేదు. ఇంద్ర ప్రపంచాన్ని తలక్రిందులుగా చూశాడు. సినిమా కూడా అలాంటి కాన్సెప్ట్ తోటే ఉంటుంది. ఈ సినిమా టీజర్ త్వరలోనే రిలీజ్ అవుతాయి అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగ్ - నానిల దేవ‌దాస్ రిలీజ్ డేట్ ఫిక్స్