Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెగాబ్రదర్ నాగబాబు పుట్టినరోజు నేడు.. శుభాకాంక్షల వెల్లువ

Advertiesment
Nagababu_Chiranjeevi_Pawan kalyan
, శనివారం, 29 అక్టోబరు 2022 (10:36 IST)
Nagababu_Chiranjeevi_Pawan kalyan
మెగాబ్రదర్ నాగబాబు పుట్టినరోజు నేడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా.. పవన్ కల్యాణ్ అన్నయ్య అయిన నాగబాబు నటుడిగా నిర్మాతగా, పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించుకున్న మెగాబ్రదర్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన వ్యక్తి. 
 
చిరంజీవి హీరోగా ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాక్షసుడు’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసారు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించినా.. అదృష్టం కలిసిరాలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఒదిగిపోయారు. ఆ తర్వాత అన్నయ్య చిరంజీవి అండదండలతో తల్లి అంజనా దేవి పేరు మీద అంజనా ప్రొడక్షన్స్ స్థాపించి.. మొదటి సినిమాగా ‘రుద్రవీణ’ సినిమాను తెరకెక్కించారు. 
 
కే.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి పేరు వచ్చినా.. కమర్షియల్‌గా హిట్ కాలేదు. ఆ తర్వాత ‘త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు..బాగున్నారా’ వంటి సినిమాలు తెరకెక్కాయి.ఇందులో బావగారు బాగున్నారా మాత్రమే హిట్ అనిపించుకుంది. 
 
మరోవైపు తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘గుడుంబా శంకర్’, రామ్ చరణ్‌తో చేసిన ‘ఆరెంజ్’ సినిమాలు కూడా నిర్మాతగా నాగబాబును కోలుకోలేని విధంగా దెబ్బతీసాయి. ఇక అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’కు సమర్పకుడిగా వ్యవహరించిన అది కూడా బాక్సాఫీస్ దగ్గర చతికిలబడింది. దీంతో సినిమా నిర్మాత ఇండస్ట్రీకి దూరమయ్యారు నాగబాబు. 
 
2009లో అన్నయ్య ప్రజారాజ్యం పార్టీలో క్రియా శీలకంగా వ్యవహరించిన నాగబాబు.. 2019లో తమ్ముడు జనసేన తరుపున యాక్టివ్‌గా ఉన్నారు. ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్ధస్త్’ కామెడీ షో ప్రారంభం అయినప్పటి నుంచి జడ్జ్‌గా ప్రేక్షకులను తన జడ్జిమెంట్‌తో ప్రేక్షకులను నవ్వించినా.. నాగబాబు.. సడెన్‌‌గా ఆ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పడం సంచలనంగా మారింది. 
 
ఇపుడు వేరే ఛానెల్‌లో కామెడీ రియాలిటీ షోస్‌కు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు నాగబాబు. ఇక నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా హీరోగా రాణిస్తున్నాడు. కూతురు నిహారిక కూడా తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక నాగబాబు పుట్టిన రోజును పురస్కరించుకుని మెగా వారింట ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 
 
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సోదరునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి నాగబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా "మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని , నీ ప్రతి పుట్టినరోజుకిఅది మరింత బలపడాలని ఆశిస్తున్నాను అంటూ.. ట్వీట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అదితి రావు హైదరితో ప్రేమలో వున్న సిద్ధార్థ్? నా హృదయ రాకుమారి..?