Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాష్ట్రంలో పాలన గాడి తప్పింది.. ఆ దేవుడే రక్షించాలి : నటుడు పృథ్వీ

Advertiesment
prudhvi actor
, గురువారం, 8 డిశెంబరు 2022 (15:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాలనపై వైకాపా మాజీ నేత, సినీ నటుడు పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. అందువల్ల రాష్ట్రాన్ని ఇక ఆ దేవుడే కాపాడాలని అభిప్రాయపడ్డారు. ఈయన ప్రస్తుతం ఏపీ జీరో ఫోర్ రామాపురం అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంకాగా, చిత్ర బృందం కడప పెద్ద దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. 
 
ఈ సందర్భంగా పృథ్వీ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలిసిందేనని చెప్పారు. ఇవాళ ఉర్సు సందర్భంగా దర్గా వద్దకు వచ్చామని, ఉర్సు రోజున ఆ భగవంతుడే రాష్ట్రాన్ని కాపాడాలని  అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో పాలన ఎపుడో గాడి తప్పిందన్నారు. అందువల్ల రాష్ట్రాన్ని ఆ దేవుడే రక్షించాలని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
"పెళ్లి చేసుకుని 15 లేదా 25 సంవత్సరాలు సజావుగా కాపురం చేస్తాం. కుదరకపోతే విడిపోతాం. ఇదీ అంతే.. ఏమైనా బాండ్ రాసి వచ్చామా, ఏదైనా బొట్టు పెట్టి వచ్చామా? పద్ధతులు నచ్చకపోతే పార్టీ నుంచి బయటకు వచ్చేశాను. పార్టీలో ఉన్నంత కాలం చిత్తశుద్ధితో కష్టపడి పనిచేశాను. నా మీద ఆరోపణలు చేసిన వారు ఇక్కడికి వచ్చి అల్లా సాక్షిగా ప్రమాణం చేయమనండి... నీతి నిజాయితీ ఉందా? లేదా? అనేది తెలిసిపోతుంది" అంటూ పృథ్వీ వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాచుపల్లి సెట్లో ఎన్ బి.కె. 108 చిత్రం ప్రారంభం