Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రముఖ మలయాళ దర్శకుడు సేతుమాధవన్ కన్నుమూత

Advertiesment
ప్రముఖ మలయాళ దర్శకుడు సేతుమాధవన్ కన్నుమూత
, శుక్రవారం, 24 డిశెంబరు 2021 (12:32 IST)
ప్రముఖ మలయాళ దర్శకుడు కేఎస్. సేతుమాధవన్ కన్నుమూశారు. వయోభారం, ఇతర వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన శుక్రవారం మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 90 యేళ్లు. ఈయన మృతివార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 
 
ఇదిలావుంటే, విశ్వనటుడు కమల్ హాసన్‌ను మలయాళ చిత్రపరిశ్రమకు పరిచయం చేసింది ఈయనే కావడం గమనార్హం. 1931లో కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాలో జన్మించిన సేతుమాధవన్.... 1961లో మాతృభాషలో దర్శకుడుగా అరంగేట్రం చేశారు. 
 
ఆ తర్వాత ఆయన మలయాళం, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో 60కిపైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1991లో 'మరుక్కమ్' అనే తమిళ చిత్రానికి ఉత్తమ దర్శకుడు అవార్డును అందుకున్నారు. 1995లో తెలుగులో "స్త్రీ'' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. 

ఈయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను 10 జాతీయ చలనచిత్ర అవార్డులు, 9 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు వరించాయి. ఈయనకు భార్య వత్సల, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కమల్ హాసన్‌ను "కన్నుమ్ కరాలుమ్" అనే చిత్రంలో బాలనటుడుగా పరిచయం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ క్రికెటర్‌తో మిల్కీ బ్యూటీ రిలేషన్‌షిప్?