Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

9 ట్రక్కుల కలప, వెయ్యి టన్నుల ఐరన్ తో నందమూరి కళ్యాణ్ రామ్, డెవిల్ 80 భారీ సెట్స్

Advertiesment
Rail set- devil
, సోమవారం, 4 సెప్టెంబరు 2023 (14:15 IST)
Rail set- devil
వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'డెవిల్". బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్ లైన్. స్వాతంత్ర్యానికి ముందు కథాంశంతో రూపొందుతోన్న ఈ పీరియాడిక్ మూవీ కోసం మేకర్స్ భారీ సెట్స్ ను వేశారు. ఈ సెట్స్ చూస్తుంటే సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
 
webdunia
house set- devil
'డెవిల్' మూవీ కోసం 80 సెట్స్ వేయటం విశేషం. ఈ సినిమాను 1940 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. కాబట్టి దానికి తగ్గట్లు సెట్స్ ను రూపొందించారు. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ ఈ చిత్రానికి సెట్స్ ను రూపొందించారు. బ్రిటీష్ పరిపాలనలో మన దేశం ఉన్నసయమానికి చెందిన సెట్స్ వేయటం తనకెంతో ఛాలెంజింగ్ గా అనిపించిందని ఆర్ట్ డైరెక్టర్ గాంధీ పేర్కొన్నారు.

webdunia
house set- devil
తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ వంటి పలు ప్రాంతాల నుంచి సెట్స్ ను రూపొందించటానికి కావాల్సిన సామాగ్రిని తెప్పించారు. నిర్మాత అభిషేక్ నామాగారి సపోర్ట్ లేకుండా ఈ రేంజ్ లో భారీ సెట్ వేసి సినిమా రిచ్ గా తెరకెక్కించటం సాధ్యమయ్యేది కాదని ఆర్ట్ డైరెక్టర్ తెలిపారు.
 
'డెవిల్' మూవీ కోసం వేసిన సెట్స్ .. వాటి విశేషాలు...
* 1940 మద్రాస్ ప్రాంతంలోని ఆంధ్రా క్లబ్
* బ్రిటీష్ కాలానికి తగ్గట్లు 10 వింటేజ్ సైకిల్స్, 1 వింటేజ్ కారు
* బ్రిటీష్ కవర్ డిజైన్ తో ఉన్న 500 పుస్తకాలు
* 1940 కాలానికి చెందిన కార్గో షిప్
* 36 అడుగుల ఎత్తైన లైట్ హౌస్ సెట్ (వైజాగ్ సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో)
* * ఈ సెట్స్ వేయటానికి 9 ట్రక్కుల కలపను తెప్పించారు. వెయ్యి టన్నులకు పైగా ఐరన్, ఫైబర్, 10వేల చదరపు అడుగుల వింటేజ్ వాల్ పేపర్ ను ఉపయోగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనూ సూద్ ఫతే, శాన్ ఫ్రాన్సిస్కో షెడ్యూల్ పూర్తి