Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

‘తిమ్మరుసు’ సెన్సార్ పూర్తి- జూలై 30న రిలీజ్

Advertiesment
Thimmarusu
, శనివారం, 24 జులై 2021 (19:39 IST)
Thimmarusu still
డిఫరెంట్ సినిమాలు, పాత్రలను ఎంచుకోవ‌డ‌మే కాదు. ఆ పాత్ర‌ల్లో ఒదిగిపోయే న‌ట‌న ఉంటే ప్రేక్ష‌కుల హృద‌యాల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకోవ‌చ్చు అన‌డానికి వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ స‌త్య‌దేవ్‌. ‘బ్లఫ్‌ మాస్టర్‌. ఉమామ‌హేశ్వరాయ ఉగ్రరూప‌స్య’ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో తనదైన నటనతో ఆక‌ట్టుకున్న స‌త్య‌దేవ్ మ‌రోసారి ‘తిమ్మరుసు’గా మెస్మ‌రైజ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. జూలై 30న సినిమాను భారీ లెవల్లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు సిద్ధంగా ఉన్నారు.
 
 
ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై 'మను' వంటి డిఫరెంట్ చిత్రాన్ని అందించిన నిర్మాత సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా సినిమాలో హీరో స‌త్య‌దేవ్‌ క్యారెక్ట‌ర్‌ను ఎలివేట్ చేసేలా రూపొందించిన ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌ను స‌మంత అక్కినేని విడుద‌ల చేయ‌గా పాట‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. అలాగే టీజ‌ర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. న్యాయం కోసం ఎంత దూర‌మైనా వెళ్లే తెలివైన లాయ‌ర్ పాత్ర‌లో స‌త్య‌దేవ్ క‌నిపించ‌నున్నారు. ప్రియాంక జ‌వాల్క‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. 
నటీనటులు:
సత్యదేవ్‌, ప్రియాంక జ‌వాల్కర్‌, బ్రహ్మాజీ, అజయ్‌, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్‌ తదితరులు
సాంకేతిక వర్గం: దర్శకత్వం: శరణ్‌ కొప్పిశెట్టి, నిర్మాతలు: మహేశ్‌ కోనేరు, సృజన్‌, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, సినిమాటోగ్రఫీ: అప్పూ ప్రభాకర్‌, ఆర్ట్‌: కిరణ్‌ కుమార్‌ మన్నె, యాక్షన్‌: రియల్‌ సతీశ్‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ ఆంటోనీ దర్శకుడిగా బిచ్చగాడు 2