Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జీవితంలో ఒక్కసారి వచ్చే ఇలాంటి పాత్ర ఇచ్చినందుకు జక్కన్నకు ధన్యవాదాలు : ప్రభాస్

టాలీవుడ్ చిత్రం ఒకటి భారతీయ చలన చిత్ర రికార్డులను బద్ధలు కొట్టింది. పైగా, గత రికార్డులను తిరగరాయడమే కాకుండా, ఏకంగా రూ.1000 కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా బాహుబలి రికార్డుపుటలకెక్కింది.

Advertiesment
జీవితంలో ఒక్కసారి వచ్చే ఇలాంటి పాత్ర ఇచ్చినందుకు జక్కన్నకు ధన్యవాదాలు : ప్రభాస్
, ఆదివారం, 7 మే 2017 (15:54 IST)
టాలీవుడ్ చిత్రం ఒకటి భారతీయ చలన చిత్ర రికార్డులను బద్ధలు కొట్టింది. పైగా, గత రికార్డులను తిరగరాయడమే కాకుండా, ఏకంగా రూ.1000 కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా బాహుబలి రికార్డుపుటలకెక్కింది. అదీ కూడా మరికొన్నేళ్ల పాటు ఆ మార్కును, ఆ రికార్డును ఎవ్వరూ దరి చేరలేనంత పెద్ద రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఈ విషయాన్ని ఆర్కా మీడియా అధికారికంగా ప్రకటించింది. ఇక, మన బాహుబలి ప్రభాస్ కూడా ఈ రికార్డ్‌పై స్పందించాడు. ఫేస్‌బుక్ వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ముఖ్యంగా అభిమానులు, రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపాడు. ప్రభాస్ చేసిన ట్వీట్‌ను పరిశీలిస్తే...
 
"నాపై ఇంతటి ప్రేమాభిమానాలు కురిపించిన అభిమానులందరికీ పేరు.. పేరున కృతజ్ఞతలు. దేశంలోనేకాక, ఓవర్సీస్‌లోని అభిమానులు నాపై పెట్టుకున్న అంచనాలను అందుకునేలా చాలా కష్టపడ్డాను. ఇంకా ఎక్కువ ఇచ్చేందుకే ప్రయత్నించాను. బాహుబలితో సుదీర్ఘ ప్రయాణం చేశాను. కానీ, దానిని మరచిపోయేలా చేసింది మీ అభిమానమే. అందుకే మీ అందరికీ నేనేం ఇవ్వగలను. తిరిగి ప్రేమించడం తప్ప. 'బాహుబలి' లాంటి పెద్ద విజన్‌లో నన్ను నమ్మి అందులో భాగం చేసినందుకు రాజమౌళి గారికి కృతజ్ఞతలు. జీవితంలో ఒక్కసారే వచ్చే ఇలాంటి పాత్ర నాకు ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఆయన బాహుబలితో నా మొత్తం ప్రయాణాన్నే చాలా చాలా ప్రత్యేకం చేశారు" అంటూ ప్రభాస్ పోస్ట్ పెట్టాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థియేటర్ నుంచి బయటకు వచ్చా కానీ బాహుబలి నుంచి రాలేక పోతున్నా : దేవీశ్రీ ప్రసాద్