Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

Naga Chaitanya, Sai Pallavi

డీవీ

, బుధవారం, 6 నవంబరు 2024 (07:29 IST)
Naga Chaitanya, Sai Pallavi


మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వున్న సంఘటన నిన్న తండేల్ టైటిల్ ప్రకటన ప్రెస్ మీట్ లో జరిగింది. వారిని దూరంగా వుండమని నిర్మాత అల్లు అరవిందే స్వయంగా పురమాయించారు. ఈ విషయాన్ని ఆయనే తెలియజేస్తూ ఆసక్తికరంగా మాట్లాడారు. వివరాల్లోకి వెళితే..
 
సినిమా ప్రమోషన్ లో ఈమధ్య సినిమా గురించి, వారి వ్యక్తిగతం గురించి కొందరు దర్శక నిర్మాతలు మీడియాను ప్రశ్న, జవాబుల కాన్సెప్ట్ తో ఉపయోగించుకోవడం ఇటీవల పరిపాటి అయింది. చిన్నా పెద్ద సినిమా తేడాలేకుండా కొత్తగా నటుడి అయినవారిని కూడా ప్రశ్నలతో సంధించి వారినుంచి ఏదోరకంగా సమాధానాన్ని రాబట్టుకుని దాన్ని ప్రచారంగా చేసుకోవడం కొందరు ప్రచార ఎత్తుగడగా భావిస్తున్నారు. ఆ కోణంలో పలు రకాలుగా ఇబ్బందులకు గురయిన సందర్భాలున్నాయి. కొంతమంది విలేకరులు కూడా కాంట్రవర్సీ ప్రశ్నలు అడిగితే వెంటనే వారికి ఫిలింఛాంబర్ నుంచి లిఖితపూర్వకంగా లెటర్ కూడా వెళ్ళిన సందర్భాలున్నాయి. ఇలాంటి ప్రశ్నలు అడిగినందుకు క్షమాపణలు చెప్పాలని కోరడంతో సదరు విలేకరులు క్షమాపణలు తెలియజేశారు. 
 
గతంలో కూడా రాజమౌళి లాంటి దర్శకుడినే భుజంపై చేయివేసి బాగా తెలిసిన స్నేహితుడిమాదిరిగా సెటైర్ గా మాట్లాడిన ఓ విలేకరి కూడా భంగపడ్డారు. చివరికి పెద్దల సమక్షంలో ఇలా చేసినందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు కొత్తతరం మీడియా యూట్యూబ్ లు రావడంతో ఏదో ఒక సెస్సేషనల్ వార్త కావాలని వున్నవి లేనివి అన్నీ కలిపి ప్రశ్నలు అడగడం అదో మేథావితనంగా భావిస్తున్న విలేకరులూ వున్నారు. ఈ విషయంలో కొందరు భంగపడి ఇండస్ట్రీ దూరంగా కొంతకాలం వున్న వారూ వున్నారు. అందుకే అల్లు అరవింద్ వంటివారు సైతం మీమేథావితనం తెలుగు అని నవ్వుతూ వ్యంగాస్త్రాలు వదిలారు.
 
ఇవన్నీ బాగా తెలిసుకాబట్టే, తండేల్ టైటిల్ ప్రకటన ప్రెస్ మీట్ లోకూడా నిర్మాత అల్లు అరవింద్ తెలివిగా ఆలోచించారు. ముక్తసరిగా సినిమా గురించి నాగచైతన్య, సాయిపల్లవిలచేత మాట్లాడించి వెంటనే వారిని పంపించేశారు. షెడ్యూల్ ప్రకారం ప్రశ్న, సమాధానాల కాన్సెప్ట్ వుంది. కేవలం అల్లు అరవింద్, బన్నీవాస్, దర్శకుడు మాత్రమే స్టేజ్ పై వుండి సమాధానాలు చెబుతామని అన్నారు. పైగా మీరు కేవలం తండేల్ సినిమా గురించే అడగండి. ఇతర విషయాలు వద్దు. ఎందుకంటే మీ మేథావితనం మాకు తెలుసు. ఇతర విషయాలను హైలైట్ చేస్తూ, తండేల్ వెనకబడిపోతుంది అనేలా మాట్లాడారు. దానికి అందరూ నవ్వుకున్నా ఇది చాలా ఆలోచించాల్సిన విషయం.
 
అయితే ఇలాంటి ఈవెంట్ లను నిర్వహించడంలో ఈ వెంట్ మేనేజర్లను కొందరు తప్పుపడుతున్నా, ఇలా చేస్తేనే ఏదోరకంగా సినిమా కొంతకాలం సోషల్ మీడియాలో బతుకుతుందనేవారు వుండబట్టే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు