సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు... తమన్నా ఏ క్యాటగిరీకి చెందుతుంది?
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లపై లైంగిక వేధింపులు సర్వసాధారణం అంటూ ఇప్పటికే చాలామంది హీరోయిన్లు చెప్పారు. కొందరైతే దర్శకులు, నిర్మాతల పేర్లు చెపుతూ వాళ్లు తమను రాత్రిపూట తమ గదులకు రమ్మన్నారని డైరెక్టుగా చెప్పేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఫైర్ బ్రాం
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లపై లైంగిక వేధింపులు సర్వసాధారణం అంటూ ఇప్పటికే చాలామంది హీరోయిన్లు చెప్పారు. కొందరైతే దర్శకులు, నిర్మాతల పేర్లు చెపుతూ వాళ్లు తమను రాత్రిపూట తమ గదులకు రమ్మన్నారని డైరెక్టుగా చెప్పేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఫైర్ బ్రాండ్‌గా పేరున్న కంగనా రనౌత్ అయితే తనను లైంగికంగా వేధించినవారి లిస్టును బహిర్గతం చేసి షాకిచ్చింది. ఇటీవలే తెలుగు హీరోయిన్లలో కొందరు నటీమణులు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
హాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ప్రముఖ నిర్మాత ఎంతోమంది నటీమణులను లైంగికంగా వేధించారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆఖరికి మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్‌కు కూడా వేధింపులు తప్పలేదని తెలియవచ్చింది. ఇక ఇప్పుడు లైంగిక వేధింపులపైన మిల్కీ బ్యూటీ తమన్నా స్పందించింది. తను సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన దగ్గర్నుంచి తను ఎలాంటి లైంగిక వేధింపులకు గురి కాలేదని తేల్చి చెప్పింది.
ఐతే కొందరు నటీమణులు కొంతమంది దర్శకులు, నిర్మాతలు వెకిలి వేషాలు వేసినా లైట్ తీసుకుంటారు. ఎందుకులే గొడవ అన్నట్లు వదిలేస్తుంటారు. మరికొందరు డైరెక్టుగా వున్నది వున్నట్లు చెప్పేస్తారు. మరి తమన్నా రెండో క్యాటగిరీకి చెందినదని అనుకోవచ్చు కదా.