తెల్లపిల్ల తమన్నాకు 2025 కలిసొచ్చినట్లే కనిపిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో నటుడు విజయ్ వర్మతో విడిపోయిన తర్వాత తమన్నా భాటియా తన జీవితంలోని కొత్త ఛాప్టర్ ప్రారంభిస్తోంది. హ్యాపీగా, స్వేచ్ఛగా వుంటోంది. సినిమా ఫంక్షన్లలో ఆకర్షణీయమైన లుక్‌తో పాటు అద్భుతమైన ఫోటోషూట్‌లతో అభిమానులను ఆకర్షిస్తోంది. ఆత్మవిశ్వాసమే తన కొత్త సంతకం అని నిరూపిస్తోంది.
అనేక బ్లాక్‌బస్టర్‌లలో నటించిన తమన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అందాలు ఓవర్ లోడ్ అన్నట్లు ఫోటోలు పెడుతూ ఫ్యాన్స్‌ను మజా చేస్తోంది. తాజాగా షైనింగ్ డ్రెస్‌లో హీట్ పెంచేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. లేటెస్ట్ ఫోటో షూట్‌కు సమంత లైక్ కొట్టింది.
పవర్ పుల్ లుక్స్‌తో పాటు మంచి క్యాప్షన్ కూడా ఇచ్చింది మిల్కీ బ్యూటీ. 'షైన్‌లో ఓ పవర్ ఉంది. అంతేకాదు అది వేసుకున్న మహిళలోనూ..' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా ఆమె నటించిన 'ఓదెల 2' మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.