Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆండ్రికోచివ్‌తో శ్రియ పెళ్లి.. తేజ, వెంకీ సినిమాకు రూ.60లక్షలు తీసుకుందట..

టాలీవుడ్ అగ్రనటి శ్రియా త్వరలో పెళ్లి కూతురు కాబోతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రష్యన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అయిన ఆండ్రికోచివ్‌ను శ్రియ మనువాడనుందని టాక్ వస్తోంది. రష్య

Advertiesment
Shriya Saran
, బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (19:47 IST)
టాలీవుడ్ అగ్రనటి శ్రియా త్వరలో పెళ్లి కూతురు కాబోతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రష్యన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అయిన ఆండ్రికోచివ్‌ను శ్రియ మనువాడనుందని టాక్ వస్తోంది. రష్యా క్రీడాకారుడితో శ్రియ ఇన్నాళ్లు శ్రియ ప్రేమలో వున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శ్రియ-ఆండ్రికోచివ్ వివాహం ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా జరుగనుందని తెలిసింది. మూడు రోజుల పాటు ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో  టాక్ వస్తోంది. 
 
మార్చి 17,18, 19 తేదీల్లో ఈ వేడుకను నిర్వహించనున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. ఇటీవల శ్రియ భారీగా చీరలు, నగలు కొనుగోలు చేసిందని.. త్వరలో ఆమె పెళ్లి కూతురు కానుందని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలను శ్రియ ఖండించింది. తన స్నేహితురాలి పెళ్లి కోసమే ఈ నగలను కొనుగోలు చేశానని క్లారిటీ ఇచ్చింది. మరి రష్యన్ క్రీడాకారుడితో శ్రియ వివాహం జరుగనుందని వస్తున్న వార్తలపై శ్రియ స్పందించలేదు.
 
మరోవైపు.. ''నేనే రాజు నేనే మంత్రి'' సినిమాలో కథానాయికగా కాజల్ అగర్వాల్ నటించింది. ఆమెను మళ్లీ తన సినిమాలో నటింపజేయడం ఇష్టం లేక తేజ శ్రియను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా కాజల్ అగర్వాల్‌ను సంప్రదిస్తే పారితోషికంగా కోటికి పైగా అడిగిందని.. దీంతో శ్రియను రూ.60లక్షలకు నిర్మాతలు ఖరారు చేసినట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జమునకు కీర్తి సురేష్ ఝలక్ ఇచ్చిందా?: సావిత్రి గారి గురించి బాగా తెలుసు..