Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సౌందర్య లాంటి వాళ్లే కాస్త గ్లామర్ ఒలకబోశారు.. మరి సాయిపల్లవి..?

Advertiesment
సౌందర్య లాంటి వాళ్లే కాస్త గ్లామర్ ఒలకబోశారు.. మరి సాయిపల్లవి..?
, బుధవారం, 6 నవంబరు 2019 (18:21 IST)
ఫిదాతో మంచి పేరు కొట్టేసిన సాయిపల్లవి.. తనకంటూ ఓ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ చిత్రం తర్వాత టాలీవుడ్‌లో సినిమాలు ఫ్లాప్ అయినా సాయిపల్లవి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

స్క్రిప్ట్ బాగుంటే సినిమాలు ఒప్పుకునే సాయిపల్లవి గ్లామర్ షో విషయంలో సాయిపల్లవి ఇదివరకే ఓపెన్‌గా మాట్లాడేసింది. తనకు లిప్ లాక్ సీన్స్ అయినా.. హాట్ సన్నివేశాల్లో నటించడం అన్నా అస్సలు పడదని చెప్పేసింది. స్క్రిప్ట్ డిమాండ్ చేసినా కూడా తను మాత్రం అలాంటి సన్నివేశాలకు దూరంగా ఉంటానని ఇది వరకే చెప్పింది.
 
తమ కథలకు సాయిపల్లవి అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుందని అనుకుంటున్నా కూడా అందులో గ్లామర్ కోణం కూడా ఉండటంతో సాయి పల్లవి ఆ సినిమాలకు నిర్ధాక్షణ్యంగా నిరాకరిస్తుంది. దాంతో దర్శకులకు షాక్ తప్పడం లేదు.
webdunia


ఒకప్పుడు సౌందర్య లాంటి వాళ్లు కూడా అప్పుడప్పుడూ పాత్రలకు తగ్గట్లుగా కాస్త గ్లామర్ ఒలకబోసారు. కానీ సాయిపల్లవి మాత్రం తాను ఆ టైప్ అమ్మాయిని కాదంటోంది. మరి దర్శకనిర్మాతల కోసమైనా కొంత మేరకు గ్లామర్ ఒలకపోసేందుకు సాయిపల్లవి ఓకే చెప్తుందో లేదో తెలియాల్సి వుంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆమె అందానికి ఫిదా... రూ.కోట్లు ఇచ్చిన బిగ్‌బాస్ నిర్వాహకులు