Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాలో వున్న రెండో కోణాన్ని చూపిస్తానంటున్న సాయిపల్లవి

Advertiesment
నాలో వున్న రెండో కోణాన్ని చూపిస్తానంటున్న సాయిపల్లవి
, సోమవారం, 18 నవంబరు 2019 (18:15 IST)
హైబ్రీడ్ పిల్ల సాయిపల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా చెప్పనవసరం లేదు. ఒకే ఒక్క సినిమాతో స్టార్‌డమ్ తెచ్చుకున్న సాయిపల్లవికి ఇప్పుడు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే అవకాశాలు తక్కువగా ఉంటున్నా ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన స్నేహితులతో వేదాంత దోరణిలో మాట్లాడడం ప్రారంభించిందట సాయిపల్లవి. ఇంతకీ ఏం మాట్లాడుతోందంటే..
 
సాయిపల్లవిని తెలుగు ప్రేక్షకులు ఒకే వైపు చూశారు.. ఇంకో వైపు చూడలేదు. నా కొత్త కోణాన్ని త్వరగా ప్రేక్షకులకు చూపిస్తానంటోంది సాయిపల్లవి. కొత్త కోణం అంటే ప్రతి సినిమాకు కొత్తగా కనిపించడమట. హావభావాల్లో మార్పులు.. కొత్తదనంగా కనిపించడం తనకు అలవాటు అంటోంది సాయిపల్లవి.
 
హీరోకు తగ్గట్లు అతని పక్కన ఏ విధంగా నటించాలన్నదే కొత్త కోణమట. ఫిదా సినిమాలో ఆరు అడుగుల కన్నా హైట్ ఉన్న వరుణ్ తేజ్ పక్కన నా నటన చూశారు కదా. హీరో కన్నా హైట్ తక్కువ ఉన్నా.. నా కళ్ళతో సైగలతో అందరినీ అలరించాను. అలాగే నా రానున్న సినిమాలో కూడా అలాగే నటిస్తానంటోంది సాయిపల్లవి. 
 
ప్రస్తుతానికి ఒకే ఒక్క సినిమా మాత్రమే నా చేతిలో ఉంది. అయితే నేను ఏ మాత్రం బాధపడడం లేదు. అవకాశం వస్తుంది. నేను అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళను. సాయిపల్లవి అంటే అందరికీ తెలిసినప్పుడు డైరెక్టర్లు నాకు తగ్గ క్యారెక్టర్లు వస్తే వారే సంప్రదిస్తారని స్నేహితులకు చెబుతోందట సాయిపల్లవి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏఎన్నార్ అవార్డ్ ఫంక్షన్.. సమంత అందుకే రాలేదా?