నటి రశ్మిక మందన్నా చాలా హాట్ టాపిక్ గా మారింది. నేషనల్ క్రష్ వంటి పేరు పొందిన ఆమె పుష్ప 2లో భర్తను చూడగానే ఫీలింగ్ తో రగిలిపోయే పాత్రలో జీవించిందనే చెప్పాలి. అయితే వ్యక్తిగతంగా ఆమె ఓ హీరోతో కలిసి వుంటుందని వార్తలు కూడా వచ్చాయి. విదేశాల్లో షికార్లు కొట్టడం, విహార యాత్రలకు వెళ్ళడం ఫొటోలు బయటకు రావడం జరిగింది. కానీ ఆమె ఆ సందర్భంలో ఎటువంటి స్పందన స్పందించలేకోయింది. సోషల్ మీడియాలోనూ బయట కూడా విజయ్ దేవరకొండతో చాలాకాలంగా డేటింగ్ లో వుందంటూ వార్తలు వచ్చాయి.
అయితే దీనిపై క్లారిటీ నిన్న వచ్చింది. రశ్మిక మందన్నా ఛావా అనే హిందీ సినిమా ప్రమోషన్ కు హైదరాబాద్ వచ్చింది. అక్కడ యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. మధ్యలో రిలేషన్ షిప్ గురించి వార్తలు వస్తున్నాయనే మాటకు, నిజమే వార్తలు వస్తున్నాయి. నేను ఓ హీరోతో కొద్దికాలంగా డేటింగ్ లో వున్నానంటూ చెప్పేసింది. అయితే ఆ హీరో ఎవరనేది పేరు బయటకు చెప్పలేదు. ఇటీవలే జిమ్ లో వుండగా తన కాలికి గాయమైందని కట్టుకని వీల్ చైర్ లోనే ప్రమోషన్ లకు తిరుగుతూ వుంది. నిన్న కూడా రశ్మిక వీల్ చైర్ లో వచ్చింది. ఫొటోలకు మాత్రం హీరో విక్కీ ఆమెను కుర్చీలోంచి లేపి నిలబెట్టారు. సో. రశ్మిక మందన్నా రిలేషన్ షిప్ పై ఇక రూమర్లు రావన్నమాట. కానీ పెండ్లి చేసుకుంటారా లేదా? అనే దానిపై వారు ఒక్కటయ్యేవరకు చర్చ జరుగుతూనే వుంటుంది.