Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరోయిన్ అందాలను చూసేందుకే ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారు.. చూపిస్తే తప్పేంటి : రష్మి

బుల్లితెరపై ఓ రేంజ్‌లో అందాల విందు చేసిన రష్మి, వెండితెర రీ ఎంట్రీ అవకాశం వచ్చేపాటికి చెలరేగిపోయింది. ''గుంటూరు టాకీస్'లో రష్మి పరచిన అందాల విందు చూసి సినీ జనాలే అవాక్కయ్యారు. అలాగే మరికొన్ని చిత్రాలల

Advertiesment
Rashmi
, శనివారం, 15 అక్టోబరు 2016 (09:39 IST)
బుల్లితెరపై ఓ రేంజ్‌లో అందాల విందు చేసిన రష్మి, వెండితెర రీ ఎంట్రీ అవకాశం వచ్చేపాటికి చెలరేగిపోయింది. ''గుంటూరు టాకీస్'లో రష్మి పరచిన అందాల విందు చూసి సినీ జనాలే అవాక్కయ్యారు. అలాగే మరికొన్ని చిత్రాలలో అదే స్థాయి సౌందర్యాలను బహిరంగపరిచడంతో ఒకానొక స్థాయిలో రష్మి అందాల ప్రదర్శన హాట్ టాపిక్ అయ్యింది. అయితే తన పని తానూ చేసుకుపోతున్న రష్మి, తాజాగా ఓ అంశంపై స్పందించింది. సినిమాలంటేనే గ్లామర్ ప్రపంచం… ఆ గ్లామర్ ప్రపంచంలో నాకున్న అందాల ప్రదర్శన చేస్తే తప్పేంటి..? తన అందాలను తెరపై చూపించడంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ కాస్త బోల్డ్ గానే స్పందించింది. 
 
హీరోయిన్లను అందంగా చూడడానికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, అలా కనిపించడంలో తప్పు అంటే తానూ ఒప్పుకోనని, అందానికి, అసభ్యతకు మధ్య ఉన్న చిన్న గీతను కొందరు మిస్ యూజ్ చేసుకుంటున్నారని తనదైన శైలిలో చెప్పుకొచ్చింది రష్మి. అయితే తాజాగా విడుదలకు సిద్ధమైన ''తను వచ్చేనంట'' సినిమాతో సక్సెస్ కొట్టాలని చూస్తున్న రష్మి, ఈ సినిమాకు మునుపెన్నడూ లేనంతగా పబ్లిసిటీ చేసేస్తోంది. 
 
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రముఖ కాలేజీలన్నింటిని ఓ రౌండ్ వేసిన రష్మి, యువతను ఆకర్షిస్తూ ''తను వచ్చేనంట'' సినిమాకు పబ్లిసిటీ ఇచ్చుకుంది. జాంభి హర్రర్ నేపధ్యంలో సాగే ఈ సినిమా ట్రైలర్లు ప్రేక్షకులను అలరించడంలో విఫలమయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ చేస్తున్న పబ్లిసిటీ పైనే ఓపెనింగ్స్ ఆధారపడి ఉంటాయి. 
 
తాజాగా ఈ సినిమాకు సంబంధించి రష్మి బ్యాక్ లెస్ హాట్ హాట్ పోస్టర్స్‌ను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. అక్టోబర్ 21వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా అయినా రష్మి ఆశిస్తున్న సక్సెస్‌ను చేరుకుంటుందో లేదో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐష్ అందాలను పిచ్చిపిచ్చిగా వాడిన దర్శకుడు... అందుకే అలాంటి రొమాన్స్ సన్నివేశాలు