Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐష్ అందాలను పిచ్చిపిచ్చిగా వాడిన దర్శకుడు... అందుకే అలాంటి రొమాన్స్ సన్నివేశాలు

ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ని తెరపై రొమాంటిక్‌గా చూసి ఎన్నో సంవత్సరాలైంది. కుమార్తె ఆరాధ్య పుట్టిన తర్వాత ఐశ్వర్యరాయ్ దాదాపు ఐదేళ్ల పాటు సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. 2015లో మళ్లీ ఆమె సినిమాలు చేయడ

Advertiesment
First Posters of Ae Dil Hai Mushkil Starring Ranbir
, శనివారం, 15 అక్టోబరు 2016 (09:23 IST)
ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ని తెరపై రొమాంటిక్‌గా చూసి ఎన్నో సంవత్సరాలైంది. కుమార్తె ఆరాధ్య పుట్టిన తర్వాత ఐశ్వర్యరాయ్ దాదాపు ఐదేళ్ల పాటు సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. 2015లో మళ్లీ ఆమె సినిమాలు చేయడం ప్రారంభించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ''జజ్బా'', ''సరబ్జీత్'' చిత్రాల్లో నటించింది. అయితే ఈ రెండు చిత్రాల్లో రొమాన్స్‌కు అసలు అవకాశమే లేదు. ఐశ్వర్యని తమ కలల రాణిగా ఊహించుకునే అభిమానులకు ఆ రెండు సినిమాలు ఏ మాత్రం సంతృప్తినివ్వలేదు. 
 
లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఐశ్వర్యరాయ్ అభిమానులకు నచ్చేవిధంగా కనిపించబోతోంది. కరణ్ జోహార్ దర్శకత్వంలో 'యే దిల్ హై ముష్కిల్' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ తనకంటే పదేళ్లు చిన్నవాడైన రణబీర్ కపూర్ ఘాటుగా రొమాన్స్ చేస్తోంది. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ ఆకట్టుకునే విధంగా, ముఖ్యంగా టీజర్లో చూపించిన రొమాంటిక్ సీన్స్ అదిరిపోయాయంటున్నారంతా. 
 
ఐశ్వర్యారయ్ ఇందులో చాలా అందంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఆమెతో పాటు అనుష్క శర్మ కూడా నటిస్తున్నప్పటికీ ఆమెను డామినేట్ చేసే విధంగా ఐశ్వర్యరాయ్ అందం ఉండటం గమనార్హం. అయితే ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్‌ గ్లామర్‌ను పిచ్చ పిచ్చగా వాడేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అయితే పబ్లిసిటీ ఇంకా సరిపోలేదని భావించడేమో దర్శక నిర్మాత కరణ్.. ఇప్పుడు మరో రెండు హాటు ఘాటు ఫోటోలు తీసి బయటికి వదిలాడు. 
 
ఒకటి రణబీర్, ఐశ్వర్య ఒడిలో సేదతీరుతున్న ఫోటో, మరొకటి రణబీర్ కపూర్ ఒడిలో సేదతీరుతున్న ఐశ్వర్య.. అయితే ఈ స్టిల్‌లో రణబీర్ చూపు ఐశ్వర్య తొడలపైనే ఉంది. దీంతో ఈ స్టిల్స్ సోషల్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అక్టోబర్ 28న ''విడుదల కానుండగా ఈ మూవీ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పబ్‌లో డ్యాన్స్ చేస్తూ... అలసిసొలసిన చైతూ - సమంత... తర్వాత ఏం జరిగిందంటే...