Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పబ్‌లో డ్యాన్స్ చేస్తూ... అలసిసొలసిన చైతూ - సమంత... తర్వాత ఏం జరిగిందంటే...

కొంతకాలంగా నాగ చైతన్య, సమంతలు లవ్‌లో ఉన్నారనే వార్తలు తెగ ప్రచారంలో ఉన్నాయి. వీరి పెళ్లికి రూట్ క్లియర్ అయ్యిందని త్వరలోనే పెళ్లిపీటలెక్కుతారనే వార్త కూడా వచ్చింది. త్వరలో పెళ్లిచేసుకుంటామని ప్రకటించి

పబ్‌లో డ్యాన్స్ చేస్తూ... అలసిసొలసిన చైతూ - సమంత... తర్వాత ఏం జరిగిందంటే...
, శనివారం, 15 అక్టోబరు 2016 (08:51 IST)
కొంతకాలంగా నాగ చైతన్య, సమంతలు లవ్‌లో ఉన్నారనే వార్తలు తెగ ప్రచారంలో ఉన్నాయి. వీరి పెళ్లికి రూట్ క్లియర్ అయ్యిందని త్వరలోనే పెళ్లిపీటలెక్కుతారనే వార్త కూడా వచ్చింది. త్వరలో పెళ్లిచేసుకుంటామని ప్రకటించి.. ప్రస్తుతం డేటింగ్ చేస్తోన్న నాగ చైతన్య, సమంతలు ఓ పబ్‌లో డాన్స్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
'ప్రేమమ్' సినిమాతో కెరీర్లోనే పెద్ద హిట్ కొట్టిన నాగ చైతన్య.. ఆ సంతోషాన్ని సమంత, ఇతర స్నేహితులతో కలిసి పంచుకున్నారు. వీరంతా ఓ పబ్‌లో చేరి ఆనందంగా చిందులేశారు. చైతూ ఆనందమే తన జీవితమని ఎప్పుడూ చెప్పే సమంత.. అందరికంటే ఎక్కువ.. అలిసిపోయేంతగా డాన్స్ చేసింది. ఈ పార్టీలో చైతూ సోదరుడు అఖిల్, అల్లు శిరీశ్‌లు కూడా హాజరయ్యారు. 
 
ఈ నేపథ్యంలో చైతూ, సమంత వీరిద్దరూ కలిసి నటించబోయే సినిమాకూడా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సెట్ అయ్యింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో  వీరు నటిస్తున్న సినిమా పేరు 'కల్యాణం' అనే టైటిల్‌తో తెరకెక్కుతోందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నాగార్జునతో తెరకెక్కించిన ''సోగ్గాడే చిన్నినాయనా'' సినిమా హిట్ తర్వాత కళ్యాణ్ కృష్ణ అక్కినేని ఫ్యామిలీకి బాగా దగ్గరైపోయాడు. ఇక తన తర్వాత సినిమా కూడా అక్కినేని హీరోతోనే చెయ్యాలని డిసైడ్ అయ్యి నాగ చైతన్యతో సినిమా కమిట్ అయ్యాడట. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో కనిపించనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రుతి హాసన్ అంతమాట అనేసిందేమిటి...? శ్రుతితో ముఖాముఖి