రకుల్ చేతిలో పెద్దగా సినిమాల్లేవు. అయినా కూడా ఆమె భారీ అమౌంట్‌ను అందుకుంటోందట. అవకాశం లేని హీరోయిన్‌కు ఎక్కువ అమౌంట్ ఇచ్చింది ఎవరో కాదు నాగార్జున. ఎందుకలా.
రకుల్ ఈ మధ్య నిత్యం వార్తల్లో ఉంటుంది. మన్మథుడు-2 సినిమాతో మరోసారి లైన్లోకి వచ్చింది. స్పైడర్ సినిమా తరువాత రకుల్‌కు ఆల్‌మోస్ట్ క్రేజ్ పోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఆమెను హీరోయిన్‌గా తీసుకునేందుకు ఎవరూ అంతగా ఆసక్తి చూపడంలేదని టాలీవుడ్లో గుసగుసలు పోతున్నాయి.
అలాంటి టైమ్‌లో నాగార్జునను పిలిచి మరీ ఆఫర్ ఇచ్చాడు. దానికితోడు మరో 50 లక్షలు అదనంగా ఇచ్చాడట. మన్మథుడు-2 సినిమాలో నాగార్జున్ 40 ప్లస్ వయస్సు దాటినా పెళ్ళి చేసుకోని పాత్రలో నటిస్తున్నాడు. పెళ్ళి చేసుకోమని తల్లి ఒత్తిడి చేయడంతో రెంట్‌కు ఒక గర్ల్ ఫ్రెండ్‌ను తీసుకొస్తాడు.
రెంట్‌కు గర్ల్ ఫ్రెండ్‌గాను, వైఫ్ గాను ఎవరు నటిస్తారు. అటువంటి పాత్రలో బాగా ఎక్స్‌పోజింగ్ చేసే పాత్ర కావాలి. దేదీ ప్యారీ సినిమాలో కూడా దాదాపు ఇలాంటి పాత్రే చేసింది రకుల్. తాజాగా నాగచైతన్యతో కూడా సినిమా చేయనుందట. కొడుకు సినిమాలో కూడా రకుల్‌కు ఆఫర్ నాగార్జునే ఇప్పించారట. కాబట్టి పారితోషికంగా ఆ డబ్బు ముందుగానే ఇచ్చాశాడని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. మరి ఈ ఆఫర్లతోనైనా రకుల్‌కి బ్రేక్ వస్తుందేమో చూడాలి.