నేను.. ఆ హీరో గదిలో 'సమ్‌థింగ్' చేస్తున్నట్టు రాస్తే రాసుకోండి... డోంట్ కేర్ : నటి ప్రాచీ
నటీనటులపై లేనిపోని పుకార్లు రావడం సహజం. ఒక హీరోయిన్.. తనకు నచ్చిన హీరోతో సన్నిహితంగా ఉన్నా... రాత్రి వేళల్లో కనిపించినా వారిద్దరికి లింకు ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు పుట్టిస్తుంటారు. ఇలాంటి వార్తే
నటీనటులపై లేనిపోని పుకార్లు రావడం సహజం. ఒక హీరోయిన్.. తనకు నచ్చిన హీరోతో సన్నిహితంగా ఉన్నా... రాత్రి వేళల్లో కనిపించినా వారిద్దరికి లింకు ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు పుట్టిస్తుంటారు. ఇలాంటి వార్తే నటి ప్రాచీ దేశాయ్‌కు ఎదురైంది. దీనిపై ఈ అమ్మడు ఎలా స్పందిస్తున్నారో చూడండి.
"మనమీద వచ్చే రూమర్స్ మీద స్పందిస్తే ఇంకా ఎక్కువ రూమర్లు వస్తుంటాయి. అందుకే నా మీద వచ్చే రూమర్స్ ఎప్పుడూ స్పందించను. అందుకే గూగుల్‌లో వెతికిన రూమర్ల మీద నేను స్పందించినట్లు దాఖలాలు ఉండవు" అని చెప్పుకొచ్చింది.
అంతేకాదు.. రూమర్లపై స్పందించడం టైం వేస్ట్. దానికి బదులు మనం చేసే పనిమీద ఇంకాస్త శ్రద్ధపెట్టి పనిచేస్తే ఆ రూమర్స్ మరిచిపోయి మన పనిగురించే మాట్లాడుకుంటారు. సో.. రూమర్స్‌పై స్పదించడం అనవసం" అని తేల్చి చెబుతోంది ప్రాచీ.