Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినిమాల్లో నటించేది రొమాన్స్ కోసం కాదు.. అది మా వృత్తి.. హీరోయిన్‌తో గొడవ.. హీరో క్లారిటీ

ఏ చిన్నపాటి సంఘటన జరిగినా.. సినీనటులపై లేనిపోని విమర్శలు వస్తుంటాయి. ఆ తర్వాత వాటికి వారు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు, షాహిద్ కపూర్‌కు మధ్య విభేదాలు

Advertiesment
Shahid Kapoor
, సోమవారం, 16 జనవరి 2017 (06:08 IST)
ఏ చిన్నపాటి సంఘటన జరిగినా.. సినీనటులపై లేనిపోని విమర్శలు వస్తుంటాయి. ఆ తర్వాత వాటికి వారు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు, షాహిద్ కపూర్‌కు మధ్య విభేదాలు పొడచూపినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. 
 
దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ తెరకెక్కిస్తున్న 'రంగూన్‌' చిత్రంలో కంగనా రనౌత్‌, షాహిద్‌ కపూర్‌ నటిస్తున్నారు. ఈ మధ్య చిత్రీకరణ సమయంలో దర్శకుడి నిర్ణయాల్లో కంగనా తలదూర్చుతోందని, అది దర్శకుడికి కొంత ఇబ్బందికరంగా మారిందని, దీంతో షాహిద్‌ కపూర్ ఎంటరయ్యాడని, కంగనా ఇలా దర్శకుడి పనిలో జోక్యం చేసుకోవడం షాహిద్‌కు ఏ మాత్రం నచ్చలేదని, ఈ విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు దారితీసి.. కోల్డ్‌వార్‌కి తెరలేపిందని వార్తలు వినిపించాయి.
 
అయితే వీటిపై స్పదించాడు షాహిద్. కంగానాతో ఎటువంటి సమస్యలు లేవు. కాకపోతే మేమిద్దరం సన్నిహితంగా ఉండేవాళ్లం కాదు. అంతదానికే మా మధ్య వివాదాలు ఉన్నట్లు కాదు కదా! మేం సినిమాల్లో నటించేది స్నేహం చేసేందుకు కాదని, అది మా వృత్తి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి" అని చెప్పుకొచ్చాడు షాహిద్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గౌతమిపుత్ర శాతకర్ణిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందన ఏంటి?