Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

23 యేళ్ల హీరోయిన్.. 40 యేళ్ళ దర్శకుడితో డేటింగ్? (video)

Advertiesment
Anu Emmanuel
, సోమవారం, 1 మార్చి 2021 (08:56 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో గుర్తింపు పొందిన హీరోయిన్లలో అను ఇమ్మాన్యుయేల్ ఒకరు. ఈ మలయాళ కుట్టి అటు మాతృభాషతో పాటు, కోలీవుడ్, టాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో నటిస్తుంది. ముఖ్యంగా, ఈ అమ్మడుకు తెలుగులో బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. అయితే, ఆమె నటించిన చిత్రాలేవీ సరైన విజయాన్ని సొంతం చేసుకోలేదు. దీంతో ఇటీవలి కాలంలో ఈ అమ్మడుకు అవకాశాలు సన్నగిల్లాయి. 
 
ఇదిలావుంటే, తమిళ హీరో విశాల్‌ హీరోగా నటించిన చిత్రం ‘తుప్పరివాలన్‌’ చిత్రం ద్వారా కోలీవుడ్‌ వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత 2019లో శివకార్తికేయన్‌ హీరోగా నటించిన ‘నమ్మ వీట్టు పిళ్ళై’ చిత్రంలో చాన్స్‌ వచ్చింది. ఈమె నటించిన మరో రెండు చిత్రాలు అండర్ ప్రొడక్షన్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో అను.. ఓ దర్శకుడుతో ప్రేమలో పడినట్టు కోలీవుడ్‌ అంతా గుసగుసలాడుతోంది.
webdunia
 
ఆ దర్శకుడు ఎవరో కాదు.. ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం కుమారుడు జ్యోతికృష్ణ. ‘యనక్కు 20.. ఉనక్కు 18’, ’కేడి’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘ఉల్లాల’అనే చిత్రంలో హీరోగా కూడా నటించారు. అదేవిధంగా తెలుగులో ‘ఆక్సిజన్‌’ అనే చిత్రానికి దర్శకత్వం వహించగా, ఇందులో అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటించింది. 
 
ఆ సమయంలో ఆమె.. దర్శకుడు జ్యోతికృష్ణతో ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయి. ఈ కారణంగానే జ్యోతికృష్ణ తన భార్య ఐశ్వర్యతో తెగదెంపులు చేసుకున్నట్టు కోలీవుడ్‌ మీడియా కోడై కూస్తుంది. మరి దీనిపై ఇరువురు ఎలా రియాక్ట్ అవుతారో వేచిచూద్ధాం. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. అను ఇమ్మాన్యుయేల్‌కు 23 సంవత్సరాలు కాగా, దర్శకుడు జ్యోతికృష్ణకు 40 యేళ్లు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుండెపోటుతో టాలీవుడ్ నిర్మాత కొరటాల సందీప్ హఠాన్మరణం