ముకుంద, ఒక లైలా కోసం చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు ఏర్పరుచుకుంది అందాల పాలపిట్ట పూజా హేగ్డే. ఆ తర్వాత హిందీలో మొహంజదారో చిత్రంలో నటించింది కానీ... సక్సస్ సాధించలేదు. దీంతో కెరీర్లో వెనకబడింది. ఇలాంటి టైమ్‌లో హరీష్ శంకర్ దువ్వాడ జగన్నాథ్ చిత్రంలో ఆఫర్ ఇచ్చాడు. ఇందులో ఆమె అందచందాలతో కుర్రకారును ఆకట్టుకుంది. వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.
ఎన్టీఆర్‌తో అరవింద సమేత చిత్రంలో నటించింది. మహేష్ బాబుతో మహర్షి సినిమాలో నటించింది. ప్రభాస్‌తో కూడా నటించబోతుంది. అయితే.. హరీష్ శంకర్ ప్రస్తుతం వాల్మీకి అనే సినిమా చేస్తున్నాడు. ఇది సినిమా బ్యాక్‌డ్రాప్‌లో ఉండే కథ. ఇందులో హీరోయిన్ పూజాహేగ్డేగా నిజమైన పాత్రను పోషించమని.. కేవలం 15 రోజులు డేట్స్ ఇస్తే చాలు అని అడిగితే.. రెమ్యూనరేష్ 2 కోట్లు కావాలని అడిగిందట. అంతే.. హరీష్ శంకర్ షాక్ అయ్యాడట.
అయితే.. ఆమెకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అంత రెమ్యూనరేష్ ఇచ్చేందుకు ఓకే చెప్పారట కానీ... ఆమెకి లైఫ్ ఇచ్చిన తనకే ఏమాత్రం మొహమాటం లేకుండా ఇంత రెమ్యూనరేషన్ కావాలని డిమాండ్ చేస్తుందా అని హరీష్ శంకర్ తెగ ఫీలవుతున్నాడట.