Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''ఊరికిచ్చిన మాట'' ఛాయల్లో రంగస్థలం: చిరు సూచనలతో-రీ షూట్?

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా, ఆదిపినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం రంగస్థలం. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలైంది. చెర్రీ, సమంత ఫోటోస్ కూడా సోషల్ మీడియా వేదికగా వ

Advertiesment
Samantha
, గురువారం, 14 డిశెంబరు 2017 (14:16 IST)
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా, ఆదిపినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం రంగస్థలం. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలైంది. చెర్రీ, సమంత ఫోటోస్ కూడా సోషల్ మీడియా వేదికగా విడుదలై వైరల్ అవుతున్నాయి. మైత్రీ మూవీ పతాకంపై నిర్మించబడుతున్న ఈ సినిమా 1980 జరిగిన కథా నేపథ్యంలో రూపుదిద్దుకుంటోంది.
 
2018 మార్చి 30న ఈ చిత్రం విడుదల కానుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి కొన్ని సూచనలు చేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ చిత్రంలో డీ గ్లామర్ అంశాలు ఎక్కువగా వున్నాయని చిరు అభిప్రాయం వ్యక్తం చేశారట. వాటిని తగ్గిస్తే మంచిదని సుకుమార్‌కి చిరు సలహాలిచ్చారట.
 
అంతేగాకుండా రంగస్థలం ఇప్పటికే వచ్చేసిన ''ఊరికిచ్చిన మాట'' సినిమా ఛాయల్లో ఉండటాన్ని కూడా చిరు గమనించారని తెలుస్తోంది. చిరంజీవి సూచనల మేరకు సుకుమార్ కొన్ని సీన్స్‌ను రీ షూట్ చేసే అవకాశం ఉందని సమాచారం. తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. దీనిపై సినీ బృందం ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సినీ యూనిట్ ఫిర్యాదు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#HBDRanaDaggubati : రానా కొత్త సినిమా లుక్ ఇదే