Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

srileela

ఠాగూర్

, శనివారం, 30 నవంబరు 2024 (09:12 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని కుర్రకారు హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే మంచి పాపులర్ అయ్యారు. పైగా, వరుస చిత్రాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంటున్నారు. దర్శక నిర్మాతలు, హీరోలు సైతం శ్రీలలను తమ చిత్రాల్లో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ శ్రీలీలకు మాత్రం ఈ తరహా క్రేజ్ ఏమిటో అంతుచిక్కడం లేదనే టాక్ చిత్రపరిశ్రమలో వినిపిస్తుంది. 
 
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందడి చిత్రంతో ఆమె తొలిసారి వెండితెరకు పరిచయమైంది. ఆ చిత్రంలో ఆమె ఎనర్జీ, డ్యాన్సింగ్ టాలెంట్‌కు దర్శక నిర్మాతలు, హీరోలు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత నుంచి ఆమెకు వరుస అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. అనతి కాలంలో క్రేజీ హీరోలందరితోనూ కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. 
 
ముఖ్యంగా, మాస్ మహరాజ్ రవితేజతో కలిసి ఆమె నటించిన 'ధమాకా' చిత్రం కేవలం శ్రీలీల డ్యాన్సులతోనే గట్టెక్కిందనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. డ్యాన్సుల ద్వారా పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ శ్రీలీల అగ్ర జాబితాలో ఉంటారు. ఇప్పుడు అందరూ ఈమెను డ్యాన్సింగ్ క్వీన్‌గా పిలుచుకుంటున్నారు. 
 
బాలకృష్ణతో 'భగవంత్ కేసరి', రామ్ 'స్కంద', నితిన్‌తో 'ఎక్స్‌టార్డినరీ మ్యాన్' వంటి చిత్రాల్లో ఈ అందాల తార మహేష్ బాబుతో నటించిన 'గుంటూరు కారం' తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. వరుస అపజయాలు పలకరించడంతో శ్రీలీలకు కాస్త డిమాండ్ తగ్గింది. ప్రస్తుతం నితిన్ సరసన 'రాబిన్ హుడ్' చిత్రంతో పాటు, విజయ్ దేవరకొండకు జోడీగా ఓ సినిమాలో నటిస్తున్నారు. 
 
మరోవైపు, ఇటీవల ఈ డ్యాన్సింగ్ క్వీన్ అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో రాబోతున్న 'పుష్ప-2' చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది. "దెబ్బలు పడతాయిరో.. దెబ్బలు పడతాయి రాజా.." అంటూ ఈ పాటలో శ్రీలీల తన డ్యాన్సింగ్ పర్ఫార్మెన్స్‌లో మెస్మరైజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ పాటలో శ్రీలీల డ్యాన్స్ చూసి అందరూ ఫిదా అయిపోతారని అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్