Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియా వారియర్ హనీ ట్రాపర్... నితిన్ పడిపోతాడా?

Advertiesment
ప్రియా వారియర్ హనీ ట్రాపర్... నితిన్ పడిపోతాడా?
, శుక్రవారం, 25 అక్టోబరు 2019 (19:29 IST)
కనుబొమలతో కథాకళి ఆడించి ఒకే ఒక్క పాటలో ఓవర్ నైట్ సెన్సేషన్ అనిపించుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. ఇది జరిగి రెండు సంవత్సరాలవుతోంది. అప్పటి నుంచి ఆమెకు ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. డైరెక్టర్లు, నిర్మాతలు ఆమె వెంట పడ్డారు. అయితే సినిమాలపైన అప్పట్లో పెద్ద ఇంట్రస్ట్ చూపించని ప్రియా ప్రకాష్‌ వారియర్ ఇప్పుడు మాత్రం ఆ నిర్ణయాన్ని మానుకుందట. 
 
తెలుగు సినిమాలో నటించేందుకు ఆమె సిద్ధమైందట. ఇప్పటికే నితిన్‌తో కలిసి ఒక సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ నటించబోతోంది. ఈ సినిమాలో మొదటి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. రెండవ హీరోయిన్ బ్యూటీ ప్రియ. హనీ ట్రాపర్ గూఢాచారిగా మళయాళ బ్యూటీ కనిపించబోతోంది. ఇక ఎన్నో సినిమాల్లో నటించి చివరకు హిట్ లేకుండా ఇబ్బందులు పడుతున్న సందీప్ కిషన్ ఒక సినిమాను ప్లాన్ చేసుకున్నాడు. దర్సకులు, నిర్మాతలు హీరోయిన్ కోసం వెతుకుతుంటే సందీప్ మాత్రం ప్రియా అయితే బాగుంటుందని చెప్పాడట.
 
దీంతో ఆమె కాల్షీట్లు కోసం డైరెక్టర్లు వెంట పడుతున్నారట. అయితే వారికి ఎవరికీ ప్రియా దొరక్కపోవడంతో కాల్షీట్లు తీసుకునే బాధ్యతను హీరో సందీప్‌కే అప్పగించారట. అయితే ఇప్పటికే నితిన్ సినిమాలో ఆమె నటిస్తుండడంతో ఇప్పట్లో కాల్షీట్లు లేవని చెప్పేసిందట ప్రియ. కానీ సందీప్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ఆమె వెంట పడుతూనే ఉన్నాడట. 
 
విషయం తెలుసుకున్న నితిన్ ఆమె ఎక్కడ కాల్షీట్లు ఇస్తే తన సినిమా మధ్యలో ఆగిపోతుందని.. అతను కూడా ప్రియతో రోజూ ఫోన్లో టచ్‌లో ఉన్నాడట. తనతో నటిస్తున్న సినిమా పూర్తయిన తరువాత ఇంకొక సినిమాను ఒప్పుకోమని నితిన్ కోరుతున్నాడట. దీంతో ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ వెంట పడడం తెలుగు చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ హీరోకు 13 ముద్దులిచ్చేందుకు సిద్ధమన్న రష్మిక?