ఒకప్పుడు రవితేజ సినిమా అంటేనే హీరోయిన్లు క్యూ కట్టేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. క్రాక్ ముందుకు ఆయనకు సరైన హిట్ లేదు. క్రాక్ లో కూడా శ్రుతిహాసన్ నటించింది. అది కూడా దర్శకుడు గోపీచంద్ తో వున్న పరిచయం వల్లే. క్రాక్ తర్వాత ఖిలాడి సినిమా చేయడానికి ఆయన సరసన పెద్ద పేరున్న హీరోయిన్లను అనుకున్నారట. నలుగురు హీరోయిన్లను దర్శకుడు రమేష్ వర్మ సంప్రదించారు. కానీ వారు ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించలేదు. కనీసం కథ కూడా వినలేదట. ఈ విషయం తెలిసిన రవితేజ సమయం లేదు మిత్రమా అంటూ.. రంగంలోకి దిగి కొత్తవారిని పరిచయం చేయాలని నిర్ణయించారు.
అప్పటికే కరోనా వేవ్ వచ్చేసింది. ఇంకోవైపు రవితేజ మరో మూడు సినిమాల్లో బిజీగా వుండాల్సి వచ్చింది. అందుకే ఖిలాడి సినిమాకు హీరోయిన్ల కోసం ఎందుకు టైం వేస్టు అనడంతో మీనాక్షి చౌదరి, డింపుల్ ను అప్పుడు అనుకున్నారట. తమిళంలో వారు చేసిన సినిమాలు చూసి ఎన్నుకున్నారు. డింపుల్ మంచి డాన్సర్. మీనాక్షి ముంబై నేపథ్యం. పాత్రపరంగా ఏదైనా చేయడానికి సిద్ధ పడింది. ఇదిలా వుండగా, రవితేజ నటిస్తున్న మరో రెండు సినిమాలకు ఇంకా హీరోయిన్లను ఫైనల్ చేయలేదు.