హనీ ఈజ్ ద బెస్ట్.. ఈ డైలాగ్ వింటే ఠక్కున గుర్తుస్తొంది మెహరీన్. పంజాబ్‌లో పుట్టి తెలుగులో సినీపరిశ్రమలో స్థిరపడింది మెహరీన్. ఈ బ్యూటీకి తెలుగులో అభిమానులు చాలా ఎక్కువే. మొదట్లో తెలుగు సినిమాలు చేయగలనా అనుకున్న మెహరీన్ ఇప్పుడు తెలుగును స్పష్టంగా మాట్లాడేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఎఫ్.2 సినిమా అంతకు ముందు మహానుభావుడు సినిమాలు మెహరీన్ కు బాగానే కలిసొచ్చాయి. ఆ సినిమాలు బాక్సాఫీసు వద్ద బారీ విజయాన్ని సాధించాయి. ఇదంతా ఒకే అయినా మళ్ళీ ఆ తరువాత సినిమా అవకాశాలు మెహరీన్ కు బాగా తగ్గాయి.
చెప్పుకోదగ్గ సినిమాలు ఏవైనా ఉన్నాయంటే అది కొన్ని సినిమాలే. లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందా.. మళ్ళీ షూటింగ్ లోకి ఎప్పుడు వెళదామా అని హీరో, హీరోయిన్లు కాసుకుని కూర్చుని ఉన్నారు. చాలామంది హీరో, హీరోయిన్ల చేతిలో సినిమాలు ఉన్నాయి. దీంతో వాళ్ళు బిజీ.
కానీ పంజాబ్ అమ్మడు మెహరీన్ కు మాత్రం చేతిలో సినిమాలు అస్సలు లేవు. ప్రస్తుతం అవకాశాలు లేక మెహరీన్ తెగ బాధపడిపోతోందట. అవకాశాల కోసం అర్రులు చాచుకుని కూర్చుందట. ఏ హీరో అయినా, ఏ దర్సకుడు అయినా ఫర్వాలేదు అవకాశం వస్తే చాలనుకుంటోందట. కానీ దర్సకనిర్మాతలను ఆమె కలవడం లేదు గానీ..అవకాశాలు తన దగ్గరికే రావాలని మాత్రం గట్టిగా కూర్చుందట. మరి చూడాలి..ఆమెకు అవకాశాలు వస్తాయో..లేకుంటే అవకాశాలు రాలేదని. ఆమే దర్సకనిర్మాతల వెంట పడుతుందో..