నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీనికి రూలర్ అనే టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి కానీ... ఇంకా అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయలేదు.
ఇదిలా ఉంటే... ఈ సినిమాని ముందుగా సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ... సంక్రాంతికి వచ్చే సినిమాలు ముందుగానే డేట్ ఫిక్స్ చేసుకోవడంతో ఈ సినిమా సంక్రాంతిని మిస్ అయ్యింది. దీంతో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ మూడో వారంలో వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే.. బాలయ్య సినిమా ఉన్నప్పటికీ మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న ప్రతి రోజు పండగే సినిమాని డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్టు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు.
దీంతో బాలయ్యతో మెగా హీరో సాయిధరమ్ తేజ్ పోటీ అనేది ఆసక్తిగా మారింది. క్రిస్మస్‌కి కూడా పోటీ ఎక్కువుగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని బాలయ్య సినిమా డేట్‌ని త్వరలోనే ప్రకటిస్తారేమో చూడాలి.